ETV Bharat / business

ప్లాట్‌ లోన్‌ తీసుకుంటున్నారా?.. ఈ రూల్స్​ తెలుసుకోండి మరి!

ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇచ్చినట్లుగానే.. ప్లాట్‌ కొనడానికి కూడా లోన్‌ ఇస్తారు. అయితే కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే లోన్ తీసుకునే ముందు ఆ నిబంధనలేంటో ఓ సారి తెలుసుకోండి.

plot loans
ప్లాట్ లోన్లు
author img

By

Published : Dec 22, 2022, 12:15 PM IST

ఇల్లు నిర్మించుకోవడానికి కావాల్సిన స్థలాన్ని కొనేందుకు కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వీటినే ప్లాట్‌ లోన్లు లేదా రియాల్టీ లోన్లు అని అంటుంటారు. ప్లాట్‌ ఉన్న స్థలం, రుణ గ్రహీత క్రెడిట్‌ చరిత్ర, వార్షికాదాయం, ఇప్పటికే ఉన్న రుణాల మొత్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి. గరిష్ఠంగా ప్లాట్‌ విలువలో 80 శాతం వరకు రుణంగా ఇస్తుంటాయి.

ఈ లోన్‌ నిబంధనలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. కొన్ని బ్యాంకులు వీటిని హోంలోన్‌ కిందే ఓ విభాగంగా పరిగణిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు కచ్చితంగా ఇల్లు నిర్మిస్తామన్న హామీ ఇస్తేనే రుణాన్ని మంజూరు చేస్తాయి. ఎందుకంటే కొంత మంది తక్కువ వడ్డీరేటుతో వచ్చే ఈ రుణాన్ని తీసుకొని ప్లాట్‌ కొంటారు. తిరిగి కొన్నాళ్ల తర్వాత కొంత లాభంతో అమ్మేసి రుణాన్ని పూర్తిగా చెల్లించేస్తుంటారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఇలాంటి రుణాలను అనుమతించడానికి ప్రధాన కారణం.. దేశంలో అందరికీ నివాస వసతి కల్పించడం. కానీ, దీన్ని దుర్వినియోగం చేస్తూ.. స్వలాభం కోసం తక్కువ వడ్డీ రుణాలను వాడుకోవడం చట్టవిరుద్ధమని నిపుణులు చెబుతున్నారు.

అన్నీ ధ్రువీకరించుకున్న తర్వాతే..
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి మాత్రమే బ్యాంకులు ప్లాట్‌ లోన్‌లను ఇస్తుంటాయి. ఎందుకంటే ఇవి చాలా రిస్క్‌తో కూడుకున్న రుణాలు. ప్లాట్‌ కొన్న తర్వాత బ్యాంకుకు సమాచారం లేకుండా నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించడం వంటి ఉదంతాలు తరచుగా జరుగుతున్నాయి. అందుకే వీటి మంజూరులో బ్యాంకులు చాలా అప్రమత్తంగా ఉంటాయి. పైగా అన్ని రకాలుగా ధ్రువీకరించుకున్న తర్వాతే బ్యాంకులు ఈ లోన్‌ ఇస్తాయి. భూమికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌, సేల్ డీడ్‌, నిరభ్యంతర ధ్రువపత్రాన్ని పరిశీలిస్తాయి.

ఎంత మొత్తం ఇస్తాయి?
ప్లాట్‌ విలువలో గరిష్ఠంగా 80 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ఎంత మొత్తం ఈఎంఐ చెల్లించగలరు? ఇప్పటికే ఏయే రుణాలున్నాయి? క్రెడిట్‌ హిస్టరీ, వార్షికాదాయం వంటి అంశాలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటాయి. సేల్‌ డీడ్‌లో పేర్కొన్న ధరనే బ్యాంకులు ప్లాట్‌ విలువగా పరిగణనలోకి తీసుకుంటాయి. నిజానికి మార్కెట్‌ విలువ అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు స్థలం ఉన్న ప్రదేశంలో మార్కెట్‌ విలువను లెక్కలోకి తీసుకుంటున్నాయి. దీనికోసం వారు వారి సొంత అధీకృత ఏజెన్సీల ద్వారా ప్లాట్‌ విలువను నిర్ధారిస్తాయి.

వడ్డీరేటు..
సాధారణంగా చాలా వరకు బ్యాంకులు గృహరుణ వడ్డీరేటునే ప్లాట్‌ లోన్‌కు వర్తింపజేస్తున్నాయి. ఇల్లు కట్టుకుంటారన్న నమ్మకంతోనే తక్కువ వడ్డీరేటును ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి కొంత గడువును విధిస్తాయి. ఆ సమయంలోగా పూర్తి చేసి సంబంధిత పత్రాలు సమర్పిస్తే తక్కువ వడ్డీరేటునే కొనసాగిస్తాయి. లేదంటే హోంలోన్‌ను సాధారణ రుణం కిందకు మార్చి వడ్డీరేటును వసూలు చేస్తాయి. పైగా లోన్‌ తీసుకున్నప్పటి నుంచి కొత్త రేటును వర్తింపజేసి ఆ మొత్తాన్ని లోన్‌కి జత చేస్తాయి.

ఒకవేళ మధ్యలోనే అమ్మేస్తే..
బ్యాంకు నిబంధనలు మాత్రం ప్లాట్‌ను మధ్యలో విక్రయించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవు. అయితే, కొన్ని బ్యాంకులు కేవలం ప్లాట్‌ను కొనడానికి మాత్రమే అనే నిబంధన కింద లోన్‌ ఇస్తున్నాయి. అలాంటప్పుడు రుణదాత, గ్రహీత మధ్య కుదిరిన ఒప్పందంపై అమ్మడం ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా సాధారణ ప్లాట్‌ లోన్‌ విషయంలో అయితే.. కచ్చితంగా ఇల్లు కట్టుకోవాల్సిందే. అయినప్పటికీ.. కొందరు బ్యాంకుల కళ్లుగప్పి అమ్మేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని నివారించడం కోసం బ్యాంకులు సేల్‌ డీడ్‌ను హామీగా పెట్టుకుంటాయి. ఇది లేకుండా ప్లాట్‌ అమ్మడం కుదరదు. అయినప్పటికీ.. నకిలీ పత్రాల ద్వారా అమ్మేస్తే బ్యాంకులు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఇల్లు నిర్మించాలనుకుంటేనే ప్లాట్‌ లోన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.