ETV Bharat / business

కొత్తగా ఉద్యోగంలో చేరారా? 50:50 ఫార్ములా ఫాలో అయితే మీ లైఫ్​ సూపర్​ హిట్​! - ఆర్థిక క్రమశిక్షణ చిట్కాలు

చిన్నవయసులో ఉన్నప్పుడు ఏదైనా చేసే శక్తి ఉంటుంది. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలు పెద్దగా ఉండవు. ఖర్చులూ తక్కువగానే ఉంటాయి. ఇలాంటప్పుడే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక ప్రణాళికలను రచించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మీతోపాటు మీ డబ్బూ మీ కోసం కష్టపడుతూ ఉంటుంది. సంపదను సృష్టించేందుకు వీలవుతుంది. మరి దీనికోసం ఎలాంటి వ్యూహాలు పాటించాలో చూద్దామా..

investment tips for young adults
investment tips for young adults
author img

By

Published : Apr 4, 2023, 1:28 PM IST

యువకులు అధికంగా ఉన్న దేశం భారత్​. 35 ఏళ్లలోపు వారు 65 శాతం వరకు ఉన్నారు. కానీ, ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం వీరిలో చాలా మంది అంతగా పట్టించుకోవడం లేదని అనేక నివేదికలు చెబుతున్నాయి. మంచి అలవాట్లను వీలైనంత తొందరగా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. అందులో డబ్బు నిర్వహణా ఒకటి అని గుర్తించాలి. చదువుకునేటప్పుడు యువకులు తల్లిదండ్రులపై ఆధారపడతారు. కానీ, ఒక్కసారి సంపాదన మొదలుపెట్టాక ప్రతీ రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేసేందుకు ప్రయత్నించాలి.

50:50 ఫార్ములాతో..
తొలి జీతం బ్యాంకులో జమ కాగానే ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది యువకులు ఈ జీతాన్ని ఖర్చు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, మొదటి నెల జీతం వచ్చిన నాటి నుంచే 50:50 సూత్రాన్ని ఆచరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆదాయంలో 50 శాతం పొదుపు చేయండి. మిగిలిన 50 శాతం ఖర్చు చేయండి. దీని వల్ల మీరు భవిష్యత్తులో కావాల్సిన విధంగా జీవించేందుకు తోడ్పాటు లభిస్తుంది. మీరు దాచిపెట్టిన సగం జీతాన్ని ముందుగా ఎలాంటి నష్టభయం లేని పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ప్రాథమికంగా మీ దగ్గర కొంత డబ్బు జమ అవుతుంది. ఒక్కసారి మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం గురించి అవగాహన వచ్చిన తర్వాత అధిక రాబడి వచ్చే పథకాలను పరిశీలించవచ్చు.

లక్ష్యం ఆధారంగా..
మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను సాధించడంలో ఇదే ముఖ్యమైన దశ. ఒక పెట్టుబడిని నిర్ణీత లక్ష్యంతో అనుసంధానం చేసినప్పుడే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించగలం. లేకపోతే.. ఏదో పెట్టుబడి పెట్టాలి కదా అని ప్రారంభించడం, మధ్యలోనే ఆపేయడం అలవాటు అవుతుంది. అందుకే స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించండి. వాటిని సాధించేందుకు తగిన పెట్టుబడి మార్గాలను ఎంచుకొని, మదుపు ప్రారంభించండి.
అవసరమైన వెంటనే నగదుగా మార్చుకునే పథకాలను ఎంచుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. స్వల్పకాలిక లక్ష్యాలకు ఇవి సరైనవే. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి ఏ మాత్రం సరిపోవనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి దీర్ఘకాలం కొనసాగే వాటినే ఎంచుకోవాలి.

రక్షణ మర్చిపోవద్దు..
చిన్న వయసులో ఉండి, ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభించిన వారికి పరిమిత ఆర్థిక వనరులు ఉంటాయి. ముఖ్యమైన కుటుంబ బాధ్యతలు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మీరే కుటుంబానికి ఆధారం కావచ్చు. పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులు, తోబుట్టువులు మీపై ఆధారపడి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు బీమా పాలసీని తీసుకోవాలి. కుటుంబానికి ఇది ఒక రక్షణ కవచం అని మర్చిపోవద్దు. చిన్న వయసులోనే బీమా పాలసీని తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అధిక విలువైన పాలసీని ఎంచుకోవచ్చు.

దీర్ఘకాలిక ప్రణాళికతో..
ఆర్థిక ప్రణాళిక ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. అందుబాటులో ఉన్న వనరులను ఎంత సమర్థంగా వాడుకుంటున్నారన్నది ఇది నిర్ణయిస్తుంది. మీ పెళ్లి, పిల్లలు, వారి చదువులు, వారి ఇతర అవసరాలు, మీ రిటైర్మెంట్​ ఇలా దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. 30-40 ఏళ్లు సంపాదించడం, అందులో నుంచి కొంత పొదుపు చేయడం ఇదంతా ఒక లెక్క ప్రకారం జరగాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని.. ముందుకు సాగాలి.

వైవిధ్యంగా..
పెట్టుబడుల కోసం ఎంచుకునే పథకాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొత్తం సురక్షితంగా ఉండే పథకాలు లేదా నష్టభయం అధికంగా ఉండేవాటినే ఎంచుకుంటే పోర్ట్‌ఫోలియో సమతుల్యత దెబ్బతింటుంది. వైవిధ్యంగా ఉన్నప్పుడు పెట్టుబడిని నష్టపోయే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

మారుతున్న ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు ఇతర అంశాల ఆధారంగా మీ ఆర్థిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. క్రమం తప్పకుండా పోర్ట్‌ఫోలియోను సరిచేసుకుంటూ ఉండాలి. మార్కెట్‌ పనితీరు ఆధారంగా మీ పెట్టుబడులను సమీక్షించుకోవాలి. కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించినప్పటి నుంచి.. రిటైర్మెంట్​ వరకు ప్రతి దశలోనూ అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.