ETV Bharat / business

2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7%!.. గతేడాది కంటే ఇది తక్కువే..! - 2022 23 భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటు

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా ఇది తక్కువే. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను.. భారత్​ కోల్పోయే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

india gdp growth rate
india gdp growth rate
author img

By

Published : Jan 7, 2023, 7:02 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది. 2021-22లో నమోదైన 8.7 శాతం కంటే ఇది తక్కువ. ప్రధానంగా తయారీ, గనుల రంగాల పేలవ ప్రదర్శన వల్లే 2022-23లో వృద్ధి రేటు తగ్గొచ్చని పేర్కొంది. 2022-23కు మొదటి ముందస్తు అంచనాలు శుక్రవారం ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసింది. '2011-12 స్థిర ధరల వద్ద 2022-23లో వాస్తవ జీడీపీ లేదా జీడీపీని రూ.157.60 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2022 మే 31న విడుదల చేసిన తాత్కాలిక అంచనా ప్రకారం జీడీపీ రూ.147.36 లక్షల కోట్లు' అని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది.

అదే విధంగా 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధిని 7 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. 2021-22లో జీడీపీ వృద్ధి 8.7 శాతమని వెల్లడించింది. కాగా.. 2022-23కు ఆర్‌బీఐ అంచనా వేసిన 6.8 శాతం వృద్ధి రేటు కంటే ఎన్‌ఎస్‌ఓ అంచనా కాస్త ఎక్కువగానే ఉండటం గమనార్హం. పై వృద్ధి అంచనానే నిజమైతే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్‌ కోల్పోయే అవకాశమే ఏర్పడొచ్చు. ప్రభుత్వం అంతకుముందు అంచనా వేసిన 8- 8.5 శాతం కంటే కూడా ఇది తక్కువే. సౌదీ అరేబియా అంచనా వేసిన తన వృద్ధి రేటు 7.6 శాతం కంటే కూడా భారత్‌ వృద్ధి రేటు అంచనా తక్కువ కావడం గమనార్హం. తదుపరి బడ్జెట్‌లో చేపట్టాల్సిన నిధుల కేటాయింపులు, చర్యల కోసం ఈ మొదటి ముందస్తు వృద్ధి అంచనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. వివిధ రంగాలపై ఎన్‌ఎస్‌ఓ అంచనాలు ఇలా..

  • తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు 2021-22లో 9.9 శాతం కాగా.. 2022-23లో 1.6 శాతానికి దిగిరావొచ్చు.
  • గనుల రంగ వృద్ధి కూడా 11.5 శాతం నుంచి గణనీయంగా తగ్గి 2.4 శాతానికి పరిమితం కావచ్చు.
  • వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదుకావచ్చు. 2021-22లో నమోదైన 3 శాతం కంటే ఇది ఎక్కువే.
  • వాణిజ్యం, ఆతిథ్యం, రవాణా, కమ్యూనికేషన్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల వృద్ధి రేటు కూడా 2022-23లో 13.7 శాతంగా నమోదుకావచ్చు. 2021-22లో ఈ విభాగాల వృద్ధి రేటు 11.1 శాతంగా ఉంది.
  • ఆర్థిక, స్థిరాస్తి, వృత్తి నిపుణుల సేవల విభాగం వృద్ధి రేటు 2021-22లోని 4.2 శాతం నుంచి పెరిగి 2022-23లో 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
  • నిర్మాణ రంగ వృద్ధి 11.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
  • పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రక్షణ, ఇతర సేవల విభాగ వృద్ధి కూడా 12.6 శాతం నుంచి తగ్గి 7.9 శాతానికి పరిమితం కావచ్చు.
  • 2022-23కు స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 6.7 శాతంగా నమోదుకావచ్చు. 2021-22లోని 8.1 శాతం కంటే ఇది తక్కువ.
  • 2022-23కు నామినల్‌ జీడీపీ వృద్ధిని ప్రస్తుత ధరల వద్ద రూ.273.08 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నామని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది. 2021-22కు తాత్కాలిక అంచనాల ప్రకారం.. నామినల్‌ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా ఉంది. 2022-23కు నామినల్‌ జీడీపీ వృద్ధి 15.4 శాతంగా అంచనా వేయగా.. 2021-22కు 19.5 శాతంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.