ETV Bharat / business

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాదే.. IMF అంచనా - ప్రపంచ ఆర్థిక వ్యవస్థ న్యూస్

ఈ ఏడాదీ ప్రపంచ ఆర్థిక వృద్ధి మందకొడిగానే ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. ఇదే నేపథ్యంలో ఆసియాలో ఆర్థికాభివృద్ధి ప్రకాశిస్తుందనీ ముఖ్యంగా భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఏకంగా సగం వాటాను నమోదు చేస్తాయని స్పష్టం చేసింది.

global economic growth 2023
global economic growth 2023
author img

By

Published : Apr 7, 2023, 11:20 AM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదీ తక్కువ వృద్ధినే నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) తెలిపింది. ఇది 3 శాతం కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసిన IMF.. ఈ పరిస్థితి మరో ఐదేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర, కోవిడ్​ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఈ ఏడాదీ కొనసాగుతాయని వివరించింది. ఐతే ఆసియాలో మాత్రం ఆర్థిక వృద్ధి ప్రకాశవంతంగానే ఉంటుందని IMF చీఫ్ జార్జీవా పేర్కొన్నారు. 1990 నుంచి అత్యల్ప మధ్యకాలిక వృద్ధి నమోదవుతున్నట్లు గుర్తుచేసిన ఆమె.. 2 దశాబ్దాల నుంచి ఆర్థిక వృద్ధి సగటున 3.8 శాతం కంటే తక్కువేనన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్, చైనాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని IMF తెలిపింది. 2023లో భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటాను కలిగి ఉంటాయని అంచనా వేసింది. 2021 తర్వాత ప్రపంచ ఆర్థికం పురోగమించిన తర్వాత రష్యా దండయాత్ర మళ్లీ తీవ్ర కలవరపాటుకు గురిచేసినట్లు తెలిపింది. యుద్ధం వల్ల 2022లో ఆర్థిక వృద్ధి సగానికి అంటే.. 6.1 నుంచి 3.4 శాతానికి దిగజారినట్లు వివరించింది.

ప్రపంచ ఆర్థిక మందగమనం అల్పాదాయ దేశాలకు కోలుకోలేని దెబ్బగా మారనుంది. అల్పాదాయ దేశాల ఎగుమతులకు డిమాండ్ తగ్గి.. రుణ ఖర్చులు అధికం అవుతాయి. కోవిడ్​ సంక్షోభం వల్ల ఏర్పడ్డ పేదరికం, ఆహార కొరత మళ్లీ ప్రబలుతుందని IMF తెలిపింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ గ్యాలపింగ్ ద్రవ్యోల్బణ రేటును తగ్గించేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్న క్రమంలో వచ్చే వారం IMF, ప్రపంచ బ్యాంకుల ప్రతినిధుల మధ్య భేటీ జరగనుంది. ఈ క్రమంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 90శాతం దేశాలు.. వృద్ధి క్షీణతను చవిచూస్తాయన్న IMF వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా భారత వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది. ఈ ఏడాది భారత వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన IMF​.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతానికి తగ్గుతుందని చెప్పింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాత్రం తిరిగి 6.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా వేసింది. దేశీయంగా డిమాండ్‌ పెరగడం వల్లే.. ఈ వృద్ధిరేటు సాధ్యమవుతుందని వెల్లడించింది. భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతుందని తెలిపింది.

ఇవీ చదవండి : ఆర్​బీఐ కీలక నిర్ణయం.. యథాతథంగా వడ్డీ రేట్లు

బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము రూ.35వేల కోట్లు.. ఆ వెబ్​సైట్లో అప్లై చేస్తే మీకే సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.