ETV Bharat / business

భారత జీడీపీ వృద్ధి రేటు 6.8శాతమే.. కోత విధించిన ఐఎంఎఫ్ - భారత జీడీపీ వృద్ధి

భారత వృద్ధిరేటులో ఐఎంఎఫ్ కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 6.8 శాతానికి తగ్గించింది. ప్రపంచ వృద్ధి రేటులోనూ కోత పెట్టింది.

IMF INDIA GDP FORECAST
IMF INDIA GDP FORECAST
author img

By

Published : Oct 11, 2022, 10:24 PM IST

భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని జూలైలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే మంగళవారం విడుదల చేసిన వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో.. భారత్‌ 6.8 శాతం మాత్రమే వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. జూలై అంచనా నుంచి 0.6 శాతం తగ్గించి, రెండో త్రైమాసికంలో ఊహించిన దాని కంటే బలహీనమైన వృద్ధి రేటును ప్రకటించింది.

అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల వల్లే భారత వృద్ధిరేటు మందగించిందని ఐఎంఎఫ్ వివరించింది. రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఉత్పత్తి తక్కువగా నమోదు కావడం, డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండడం వంటి పరిణామాలే వృద్ధిలో కోత విధించడానికి గల కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను తగ్గించాయి.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగానూ మందగమనం నెలకొంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2021లో 6 శాతంగా నమోదైన వృద్ధి రేటు ఈ ఏడాది 3.2 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కేవలం 2.7 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో లాక్‌డౌన్లు వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2021లో 8.1 శాతం వృద్ధిని సాధించిన చైనా ఈసారి 3.2 శాతానికి పరిమితం కానుందని ఐఎంఎఫ్ అంచనా కట్టింది. జీరో కొవిడ్‌ పాలసీలో భాగంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లే ఇందుకు కారణమని పేర్కొంది. అమెరికా వృద్ధి రేటు కేవలం ఒక్క శాతానికే పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.