ETV Bharat / business

తక్కువ రిస్క్​తో ఎక్కువ ప్రతిఫలం కావాలా? అయితే ఈ స్కీమ్​ మీకోసమే! - ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ

IDFC Mutual Fund: స్టాక్ మార్కెట్లలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులూ కొనసాగుతూ ఉంటాయి. వీటిల్లో కాస్త తక్కువ ఆటుపోట్లు ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చేలా ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకానికి ఆఖరి తేదీ ఈ నెల 23. అయితే మరెందుకు ఆలస్యం.. ఆ పథకమేంటో ఓ సారి చూసేయండి.

IDFC Mutual Fund
ఐడీఎఫ్‌సీ
author img

By

Published : Sep 22, 2022, 4:39 PM IST

IDFC Mutual Fund: స్టాక్‌ మార్కెట్లో షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూ ఉంటాయి. వీటిల్లో కాస్త తక్కువ ఆటుపోట్లు ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చేలా ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త ఇండెక్స్‌ ఫండ్‌ తరగతికి చెందిన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌' ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఈ సమయంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పెట్టుబడుల జాబితాలో ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ తరగతికి చెందిన షేర్లు ఉంటాయి.

నిఫ్టీ 100 సూచీలో ప్రస్తుతం నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌కు అధిక వెయిటేజీ ఉంది. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన కంపెనీలు అధికంగా కనిపిస్తాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ రిస్కుతో అధిక ప్రతిఫలం లభించే అవకాశం ఉంటుందని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. పదేళ్ల కాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌తో పోలిస్తే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ ఇండెక్స్‌ అధిక రాబడిని ఆర్జించింది. అదే సమయంలో హెచ్చుతగ్గులు తక్కువ. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధంగా ఉన్న మదుపరులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.

సూచీ ఆధారంగా..

  • ఇండెక్స్‌ ఫండ్‌ తరగతికి చెందిన కొత్త పథకాన్ని ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 28 వరకూ కొనసాగుతుంది. కనీస పెట్టుబడి రూ.5వేలు. నిఫ్టీ 50 సూచీతో పోలిస్తే, నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌లో వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు సమ ప్రాధాన్యం ఉంది. అందువల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం కనిపిస్తుంది.
  • స్థిరాదాయాన్ని అందించే పథకాల్లో మదుపు చేసే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ)- సిరీస్‌ 68 అందుబాటులోకి వచ్చింది. ఇందులో పెట్టుబడిని 1302 రోజులు కొనసాగించాల్సి ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.5,000. ప్రధానంగా డెట్‌ పథకాల్లో ఇది మదుపు చేస్తుంది.

ఇవీ చదవండి: తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

రూ.20వేల కోట్ల బ్యాంకు స్కామ్​.. ఏబీజీ షిప్​యార్డు వ్యవస్థాపక ఛైర్మన్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.