ETV Bharat / business

ట్విట్టర్​తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్! - ఎలాన్ మస్క్ ట్విట్టర్ అప్​డేట్​

బ్లూటిక్​కు డబ్బులా?.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్​ పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన తర్వాత ప్రకటనపై చాలా మంది వేసిన ప్రశ్న ఇది. అయినా.. ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. బ్లూటిక్​కు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇతర దిగ్గజ సంస్థలూ అదే బాటలో పయనించేలా చేశారు. ఇప్పుడు ట్విట్టర్ బాస్ మస్క్.. మరో ప్రకటన చేశారు. ట్విట్టర్​ ద్వారా యూజర్లు డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పారు.

how users-earn-money-from-twitter
ట్టటర్​ నుంచి ఆదాయ పొందడం ఎలా
author img

By

Published : Feb 21, 2023, 6:06 PM IST

ట్విట్టర్​ అధినేత ఎలాన్​ మస్క్.. ఆ సంస్థలో అనేక కీలక మార్పులకు ​స్వీకారం చుడుతున్నారు. ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చినప్పటి నుంచే తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. వస్తూ వస్తూనే సంస్థలో.. పరిపాలన పరంగా పలు కీలక మార్పులు తీసుకువచ్చారు.​ బ్లూటిక్‌ సేవల్లో సైతం మార్పులు చేపట్టారు. ఖాతాల బ్లూటిక్‌ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆ విషయంలో విమర్శలు వచ్చినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు మస్క్​ను​ చూసి.. మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. తాము కూడా ​ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​​లో బ్లూటిక్‌ ఫీచర్​ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

అయితే మొదట్లో మస్క్​ వైఖరిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. ప్రస్తుతం మస్క్​నా..​ మజాకా అంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో.. యూజర్లను ఆకట్టుకుంటున్నారని కితాబిస్తున్నారు. ట్విట్టర్​లో​ పలు కీలక మార్పులు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన మస్క్​.. తాజాగా ​మరో గుడ్ న్యూస్ చెప్పారు. దీనిపై సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై ట్విట్టర్​ నుంచి కూడా యూజర్లు డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపారు. వేర్వేరు సందర్భాల్లో మస్క్ చెప్పినదాని బట్టి.. రెండు మార్గాల్లో ట్విట్టర్​ యూజర్లు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. ఒకటి కంటెంట్​​ రాస్తూ.. మరొకటి ట్విటర్​లో నగదు లావాదేవీలు చేస్తూ.

కంటెంట్​​ రాస్తూ.. ఆదాయం..
సాధారణంగా బ్లూ టిక్​ లేని యూజర్లు.. 280 అక్షరాలతో ట్విటర్​లో ఓ పోస్ట్​ పెట్టవచ్చు. కానీ బ్లూ టిక్​ ఉన్న యూజర్లకు మాత్రం​.. 4వేల అక్షరాలతో పోస్ట్​ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఆధారంగానే ఈ కొత్త ఫీచర్​ తీసుకువచ్చారు మస్క్​. ట్విట్టర్​ నుంచి డబ్బులు సంపాందించే అవకాశం యూజర్లకు కల్పిస్తున్నారు. యూజర్​ పోస్ట్ చేసిన కంటెంట్​ను చదవాలంటే మాత్రం ఫాలోవర్స్​ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కంటెంట్ చదవాలనుకున్న వ్యక్తి.. దాన్ని​ రాసిన వ్యక్తి ఖాతాను సబ్​స్క్రైబ్ చేసుకోవాలి. అందుకు కొంత సొమ్మును చెల్లించాలి. ఈ పద్ధతిలోనే ట్విట్టర్​ నుంచి డబ్బులు సంపాందిచుకోవచ్చని మస్క్​ తెలిపారు. కేవలం ఒక్క క్లిక్​తోనే డబ్బులు చెల్లించి.. కంటెంట్ చదవవచ్చని వెల్లడించారు.

ఉదాహరణకు.. ఒక రచయితనే తీసుకుంటే.. తాను రాసే కవితలు, ఆర్టికల్స్, వ్యాసాలు వంటి ఇతర అంశాలను ట్విట్టర్​లో పోస్ట్​ చేయొచ్చు. వాటిని చదివేందుకు ఆసక్తి ఉన్నవారు.. కొంత డబ్బులు చెల్లించి చదవాల్సి ఉంటుంది. ఇలా ఓ పుస్తకాన్నే ట్విటర్​లో విడుదల చేయవచ్చు. మొత్తం ఒకేసారి గానీ, చాప్టర్​వైజ్​గా గానీ విడతల వారిగా విడుదల చేయవచ్చు. ఆ పుస్తకాన్ని చదవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాలి. మస్క్​ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇది ఓ గొప్ప ఆలోచనని పొగుడుతున్నారు.

ట్విట్టర్​తో వడ్డీ వ్యాపారం!
ట్విట్టర్​లో డిజిటల్ పేమెంట్స్ సేవలు ప్రారంభించే ఆలోచన ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు మస్క్. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. గూగుల్​ పే, ఫోన్​ పే తరహాలో.. ట్విట్టర్​లోనూ నగదు బదిలీ చేయొచ్చు. బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్​ వ్యవస్థనే ఈ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థకు ఆధారంగా చేసుకోనున్నట్లు మస్క్​ గతంలో వివరించారు.

ట్విట్టర్ బ్లూటిక్​ సబ్​స్క్రైబర్లు క్రిడెట్ కార్డ్ లేదా డెబిట్​ కార్డ్​తోనే సైన్​అప్​ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ట్విట్టర్​ ద్వారా యూజర్లు ఇతరులకు డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. బ్యాంకు ఖాతాకు బదులు.. ట్విట్టర్​ అకౌంట్​లోనూ నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అలా జమ చేసే యూజర్లకు అధిక వడ్డీ కూడా చెల్లిస్తారు. అయితే.. ఈ ఫీచర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.