ETV Bharat / business

మీ UPI PIN మార్చాలా? సింపుల్ స్టెప్స్​తో సేఫ్​గా చేయండిలా! - గూగుల్​పేలో యూపీఐ పిన్​ను ఎలా రీసెట్​ చేయాలి

How To Reset UPI PIN : డిజిటల్​ లావాదేవీల​ కోసం మీరు వాడే యాప్​ల నుంచి మీకు తెలియకుండానే ఎవరైనా డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేసుకుంటారని భయపడుతున్నారా? మరేం ఫర్వాలేదు కొన్ని సింపుల్​ స్టెప్స్​​తో మీ మొబైల్​లోని వివిధ పేమెంట్స్​ యాప్​లకు వినియోగించే 'UPI PIN'లను సులువుగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Simple Steps To Follow For Reset UPI PIN
How To Reset UPI PIN
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 1:19 PM IST

How To Reset UPI PIN : Phonepe, Google Pay, Paytm.. ప్రస్తుతం ఈ అప్లికేషన్లనే డిజిటల్​ పేమెంట్స్​ కోసం వినియోగిస్తున్నారు చాలామంది. వీటి సాయంతోనే క్షణాల్లో అన్ని రకాల చెల్లింపులు చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆన్​లైన్​ మోసాలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాల్లో నుంచి నిమిషాల్లో డబ్బును కాజేస్తున్నారు సైబర్​ కేటుగాళ్లు. ఈ క్రమంలో వివిధ పేమెంట్స్​ యాప్స్​ అందిస్తున్న ఆప్షన్స్​ను వినియోగిస్తే వీటి బారిన పడకుండా ఉంటామని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం అప్లికేషన్స్​లోకి వెళ్లి మీ 'UPI PIN'లను తరచూ మారుస్తుండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఫోన్​పై, గూగుల్​ పే లేదా పేటీఎమ్​లలో కొత్త యూపీఐ పిన్​ను ఎలా 'RESET' చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Gpayలో కొత్త UPI PINను క్రియేట్​ చేయండిలా..
How To Reset UPI PIN In Google Pay :

  1. ముందుగా Google Pay యాప్​ను తెరవండి.
  2. తర్వాత అప్లికేషన్​ కుడివైపున ఉండే ప్రొఫైల్​ పిక్​పై క్లిక్​ చేయండి.
  3. మీరు పిన్​ రీసెట్​ చేయాలనుకుంటున్న బ్యాంక్​ అకౌంట్​ను ఎంచుకోండి.
  4. ఇక్కడ మీకు కనిపించే స్క్రీన్​పై కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్​ చేయండి.
  5. ఇప్పుడు 'Change UPI PIN' ఆప్షన్​పై ట్యాప్ చేయండి.
  6. 6 అంకెల పాత UPI PINను ఎంటర్​ చేసిన అనంతరం కొత్తగా క్రియేట్​ చేయాలనుకునే PINను కూడా టైప్​ చేయండి.
  7. వెరిఫికేషన్​​ కోసం అదే పిన్​ను మరోసారి ఎంటర్​ చేయండి. దీంతో మీ కొత్త UPI PIN క్రియేట్​ అవుతుంది.

PhonePeలో UPI PINను సెట్ చేసుకోండిలా..
How To Reset UPI PIN In PhonePe :

  1. ముందుగా మీ మొబైల్​లో PhonePe యాప్​ను ఓపెన్​ చేయండి.
  2. అప్లికేషన్​ ఎడమవైపు పైభాగంలో ఉండే ప్రొఫైల్​ ఫొటోపై క్లిక్​ చేయండి.
  3. అనంతరం మీరు అప్పటికే లింక్ చేసిన బ్యాంక్​ ఖాతాలు 'Payment Methods' సెక్షన్​లో కనిపిస్తాయి.
  4. ఆపై మీరు ఏ బ్యాంక్​ UPI PIN అయితే మార్చాలనుకుంటున్నారో లేదా రీసెట్​ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి.
  5. ఇక్కడ మీకు UPI PIN బాక్స్​లో 'RESET' అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి.
  6. అనంతరం మీరు ఎంచుకున్న బ్యాంక్​ డెబిట్​ కార్డ్​ వివరాలను ఎంటర్​ చేయండి.
  7. వివరాలు​ అందించిన తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్​కు 6 అంకెల ఓ OTP మెసేజ్​ వస్తుంది.
  8. ఈ ఓటీపీని అడిగిన బాక్స్​లో ఫిల్​ చేయండి.
  9. తర్వాత మీ డెబిట్​ కార్డ్​కు వినియోగించే 4 అంకెల సంఖ్యను ఎంటర్​ చేయండి.
  10. ఇప్పుడు కొత్త UPI PINను సెట్​ చేయండి.
  11. ఇక్కడ మీరు 4 లేదా 6 అంకెలు కలిగిన UPI PINను క్రియేట్​ చేసుకునే వీలుంటుంది.
  12. ధ్రువీకరణ కోసం అప్పుడే ఎంటర్​ చేసిన కొత్త UPI PINను మరోసారి టైప్​ చేయండి.
  13. చివరగా 'Confirm' ఆప్షన్​పై ట్యాప్​ చేయండి. అంతే PhonePeలో మీ కొత్త UPI PIN రీసెట్​ అవుతుంది.

Paytmలో UPI PINను మార్చుకోండిలా..
How To Reset UPI PIN In Paytm :

  1. ముందుగా మీ మొబైల్​లో Paytm అప్లికేషన్​ను తెరవండి.
  2. యాప్​ తెరిచాక ఎడమవైపు ఉండే 'Profile' ఐకాన్​పై క్లిక్​ చేయండి
  3. 'Payment Settings' ఆప్షన్​ను ఎంచుకోండి.
  4. తర్వాత మీరు పిన్​ మార్చాలనుకుంటున్న బ్యాంక్​ ఖాతాను సెలెక్ట్​ చేయండి.
  5. అక్కడే 'Change PIN' అనే మరో ఆప్షన్​ కనబడుతుంది. దానిపై క్లిక్​ చేయండి
  6. ఆపై డెబిట్​ కార్డ్​ వివరాలను ఎంటర్​ చేయండి.
  7. తరువాత 'Proceed' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  8. ఇప్పుడు మీ పాత UPI PINను ఎంటర్​ చేసిన తర్వాత కొత్తగా క్రియేట్​ చేయాలనుకుంటున్న UPI PINను టైప్​ చేయండి.
  9. చివరగా ప్రాసెస్​ను కన్ఫామ్​ చేసి ముందుకు సాగండి.

How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!

PhonePe Launches Indus Appstore : గూగుల్​ ప్లేస్టోర్​కు పోటీగా..​ ఫోన్​పే ఇండస్​ యాప్​స్టోర్​ లాంఛ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.