ETV Bharat / business

పెట్రోల్​ బంక్​ నడుపుతారా? - ఒకసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం! - భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నోటిఫికేషన్​

How to Open New Petrol Pumps in India: పెట్రోల్​ బంక్​ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? అయితే మీ కోసమే ఇది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) కొత్త పెట్రోల్ బంక్​ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరి, బంక్ ఏర్పాటు చేయాలంటే అర్హతలేంటి? లైసెన్స్​ ఎలా పొందాలి..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Open New Petrol Pump in India
How to Open New Petrol Pumps in India
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 12:37 PM IST

How to Open New Petrol Bunk in India: కొన్ని బిజినెస్​లకు సంవత్సరమంతా ఫుల్​ డిమాండ్ ఉంటుంది. అలాంటి వాటిల్లో పెట్రోల్ బంక్ ఒకటి. సరైన ప్రాంతంలో పెట్రోల్ బంక్​ ఏర్పాటు చేసుకుంటే చాలు.. ఆదాయానికి ఏ ఢోకా ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆయిల్ మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) కొత్త పెట్రోల్ బంక్​ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 14,273 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. మరి పెట్రోల్ బంక్ ప్రారంభించేందుకు అర్హతలేంటి? పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది..? లైసెన్స్​ ఎలా పొందాలి..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అలర్ట్ ​- కొత్త సిమ్​ కార్డు కొనాలా? ఈ రూల్స్​ తెలియకపోతే అంతే!

అర్హతలు:

Eligibility to Open Petrol Pump:

  • పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేందుకు 21 నుంచి 55 ఏళ్ల లోపు వయసు ఉండాలి.
  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసే వ్యక్తికి రిటైల్ అవుట్‌లెట్, ఇతర బిజినెస్ నిర్వహించడంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • దరఖాస్తుదారుడి ఆదాయం కనీసం రూ.25 లక్షలు ఉండాలి. అలాగే తన కుటుంబం మొత్తం సంపద రూ.50 లక్షలకు మించకూడదు.
  • ఎలాంటి నేర చరిత్రా ఉండకూడదు.
  • ఏదైనా లోన్‌ డీఫాల్టర్‌గా ఉండకూడదు.

గీజర్ కొనడానికి ప్లాన్​ చేస్తున్నారా? - అయితే ఈ బెస్ట్ మోడల్స్​పై ఓ లుక్కేయండి!

బంక్​ ఏర్పాటుకు భూమి వివరాలు:

  • బంక్ ఏర్పాటు చేసే ప్రదేశం.. దరఖాస్తుదారుడి పేరుపైనే ఉండాలి. చట్టపరంగా ఎలాంటి వివాదాలూ ఉండకూడదు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ తెరిచేందుకు.. సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుంది.
  • రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసమైతే 1200 చదరపు మీటర్ల భూమి అవసరం.
  • అర్బన్ ప్రాంతాల్లో సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌ కోసం 500 చదరపు మీటర్లు అవసరం.
  • రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం 800 చదరపు మీటర్ల స్థలం కావాలి.
  • జాతీయ రహదారులపై పెట్రోల్ బంక్ కోసం సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 1200 చదరపు మీటర్లు కావాలి.
  • రెండు డిస్పెన్సింగ్ యూనిట్లకు 2000 చదరపు మీటర్ల భూమి అవసరం.

చిల్లర సమస్యకు చెక్​- క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో కాయిన్స్​- ఎలా విత్​ డ్రా చేయాలో తెలుసా?

పెట్రోల్​ బంక్​ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి కావాలి:

  • పెట్టుబడిలో భూమి ధర, నిర్మాణ ఖర్చు, మిషినరీ ఖర్చులు, లైసెన్సింగ్ ఫీజు వంటివి కలిసి ఉంటాయి. ఇందులో స్థలం విలువ రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండొచ్చు.
  • కన్‌స్ట్రక్షన్ విషయానికొస్తే.. డిజైన్, మెటీరియల్స్, పెట్రోల్ బంక్ పరిమాణం బట్టి ఉంటుంది.
  • బంక్​ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కావచ్చు.
  • ఎక్విప్‌మెంట్ కాస్ట్​లో.. ఫ్యూయెల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఖర్చు, స్టోరేజీ ట్యాంకుల ఖర్చు, ఇతర మెటీరియల్ ఉంటాయి. దీనికి రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
  • లైసెన్స్ ఫీజుల కింద రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

మీకు ఎల్​ఐసీలో పాలసీ ఉందా? - ఈ నెంబర్​కు 'Hai' అని పెడితే నిమిషాల్లో పూర్తి వివరాలు!

లైసెన్స్ ఎలా పొందాలి? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, HPCL, SR, రిలయన్స్ కంపెనీలు.. పెట్రోల్ బంక్‌ల కోసం లైసెన్స్ జారీ చేస్తాయి.

  • పెట్రోల్ పంప్ తెరవాలనుకుంటే వార్త పత్రికలలో లేదా అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తుంటాయి. అలాగే.. లాటరీ విధానంలో ఎంపిక చేస్తుంటాయి.
  • ఇక పెట్రోల్ పంప్ డీలర్ ఛయాన్ వెబ్‌సైట్‌ https://www.petrolpumpdealerchayan.in/ లో ప్రకటనలు కనిపిస్తుంటాయి.
  • డీలర్‌షిప్‌ ప్రకటనలోనే అన్ని వివరాలు, కండీషన్లు ఉంటాయి.
  • "రిజిస్టర్ నౌ" ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అకౌంట్ తెరవాలి.
  • లాగిన్ అయిన తర్వాత "అవేలబుల్ అడ్వర్టైజ్‌మెంట్‌"పై క్లిక్ చేయాలి.
  • కంపెనీ పేరు, రాష్ట్రం ఎంపిక చేసుకొని.. "అప్లై నౌ" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అడిగిన అన్ని వివరాలను అందించాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత "సబ్మిట్‌" బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ఫాం ఖర్చు ప్రాంతాలను బట్టి మారుతుంటుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.100, మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో రూ.1000 ఉంటుంది. SC, ST, OBC లకు చెందిన వారి అప్లికేషన్ ఫీలో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

"మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్​" - మెచ్యూరిటీకి ముందే క్లోజ్​ చేయాలంటే ఎలా?

ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైమ్‌ ఫ్రీ - సూపర్ బెనిఫిట్స్ కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.