How To Improve Your Credit Score Fast : నేటి కాలంలో బ్యాంకు రుణాలు పొందాలంటే, క్రెడిట్ స్కోర్ తప్పనిసరి అయిపోయింది. బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులను, రుణం తీర్చే సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క. అందువల్ల బ్యాంకులు మీకు సులువుగా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. పైగా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయి. అదే మీకు మంచి క్రెడిట్ స్కోర్ లేకపోతే, మీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. లేదా సహ రుణగ్రహీత కూడా ఉండాలని షరతు విధిస్తాయి. మరీ తక్కువ క్రెడిట్ స్కోర్ అంటే, బ్యాంకులు మిమ్మల్ని అధిక రిస్కు ఉన్న రుణగ్రహీతగా పరిగణిస్తాయి. ఒకవేళ బ్యాంకులు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి రుణం ఇచ్చినా, అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కనుక, మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయడం చాలా అవసరం. దీని కోసం ఏం చేయాలంటే?
How To Improve Your CIBIL Score :
- మీ సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి సులభంగానే క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. కానీ ముందుగా తక్కువ క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. దీని ద్వారా మీ క్రెడిట్ స్కోరును నిర్మించేందుకు ముందడుగు వేయాలి. ఒక సారి క్రెడిట్ కార్డును తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.
- మీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. మీ క్రెడిట్ పరిమితిలో 30 శాతానికి మించకుండా జాగ్రత్తపడాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎప్పటికప్పుడు తీర్చేయడం ద్వారా మంచి క్రెడిట్ హిస్టరీ క్రియేట్ చేసుకోవచ్చు.
- కొన్నిసార్లు బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు కొంత డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానికి అనుబంధంగా క్రెడిట్ కార్డును తీసుకోవాలి. ఈ కార్డు వాడకం అలవాటయ్యాక, సాధారణ క్రెడిట్ కార్డును తీసుకోవాలి.
- నేడు ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కనుక మంచి ఆఫర్లు ఉన్న, తక్కువ ధరలో లభిస్తున్న ప్రొడక్టును క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయాలి. ఉదాహరణకు మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసి 6 లేదా 8 నెలల వ్యవధిలో అన్ని వాయిదాలను చెల్లించాలి. అప్పుడు మీకు మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది.
- బ్యాంకు లోన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందో, లేదో చూసుకోవాలి. అలాగే అప్పు తీసుకునే ముందు మీ అవసరాలను కచ్చితంగా అంచనా వేసుకోవాలి. రుణం తీసుకున్న తరువాత బాకీలను సకాలంలో తిరిగి చెల్లించాలి. అలాగే మీ క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దానిలో ఏవైనా తప్పులుంటే, వెంటనే వాటిని సరిచేసుకోవాలి. అప్పుడే మీరు మంచి క్రెడిట్ స్కోర్‌ను పొందగలుగుతారు.
మీరు ఉద్యోగులా? మీ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును సింపుల్‌గా లెక్కించండిలా!
నయా సైబర్ స్కామ్ - ఆ నంబర్‌కు కాల్ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!