ETV Bharat / business

ATM బిజినెస్​తో నెలకు రూ.60వేలు ఆదాయం - ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా? - ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ పొందడం ఎలా

How To Get SBI ATM Franchise In Telugu : మీరు ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? లేదా ఎక్స్​ట్రా మనీ కోసం ఏమైనా చేద్దామని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ​తో మీరు నెలకు రూ.60,000 వరకు సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI ATM Franchise benefits
How to Get SBI ATM Franchise
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 1:10 PM IST

How To Get SBI ATM Franchise : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ.. ఏటీఎం ఫ్రాంచైజీ ద్వారా ఒక ప్రత్యేకమైన వ్యాపార అవకాశాన్ని కల్పిస్తోంది.​ దీని ద్వారా మీరు ఇంట్లోనే ఉంటూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఏటీఎంలను బ్యాంకులు ఏర్పాటు చేయవు!
నిజానికి దేశంలోని బ్యాంకులన్నీ ఏటీఎంలను ఇన్​స్టాల్ చేయవు. చేసేవి కూడా తమంత తాము స్వయంగా ఏటీఎంలను ఏర్పాటు చేయవు. ఎందుకంటే, కొన్ని కంపెనీలు.. ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాయి. కనుక ఆ కంపెనీలే ఆయా బ్యాంకుల ఏటీఎంలను వివిధ ప్రదేశాల్లో ఇన్​స్టాల్ చేస్తుంటాయి.

ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటుకు కావాల్సినవి ఇవే!
SBI ATM Franchise Requirements :

  1. ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు చేయాలంటే.. కనీసం 50 నుంచి 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
  2. కనీసం 100 మీటర్ల దూరంలో మరో ఇతర ఏటీఎంలు ఉండకూడదు.
  3. ప్రజలు అందరికీ కనిపించే విధంగా, గ్రౌండ్ ఫ్లోర్​లో సదరు బిల్డింగ్​ లేదా గది ఉండాలి.
  4. సదరు బిల్డింగ్ లేదా గదికి 1KW ఎలక్ట్రిసిటీ కనెక్షన్​, 24 గంటలపాటు నిరంతరాయంగా పవర్​ సప్లై ఉండాలి.
  5. ప్రతి రోజు కనీసం 300 ట్రాన్సాక్షన్స్ అయినా ప్రాసెస్​ చేయగలగాలి.
  6. ఏటీఎం ఏర్పాటు చేసే బిల్డింగ్​కు కచ్చితంగా కాంక్రీట్​ రూఫ్ ఉండాలి.
  7. V-SAT కూడా ఇన్​స్టాల్ చేసి ఉండాలి.

నోట్​ : ఈ V-SAT ఇన్​స్టాలేషన్​కు ప్రభుత్వం నుంచి గానీ, సొసైటీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.

కావాల్సిన డాక్యుమెంట్స్​
SBI ATM Franchise Required Documents :

  • ఐడీ ప్రూఫ్​ : ఆధార్ కార్డ్​, పాన్​ కార్డ్​, ఓటర్ ఐడీ
  • అడ్రస్​ ప్రూఫ్​ : రేషన్ కార్డ్​, ఎలక్ట్రిసిటీ బిల్​
  • బ్యాంక్​ అకౌంట్​, పాస్​బుక్​
  • ఫొటోగ్రాఫ్​
  • ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​
  • జీఎస్​టీ నంబర్​
  • ఫైనాన్సియల్ డాక్యుమెంట్స్​
  • బ్యాంక్​ అడిగే ఇతర పత్రాలు

ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ పొందడం ఎలా?
How To Get SBI ATM Franchise : ఎస్​బీఐ నేరుగా ఏటీఎం ఫ్రాంచైజీ ఇవ్వదు. ఎస్​బీఐ ఏటీఎంను ఏర్పాటు చేసే కాంట్రాక్ట్​ను... ముత్తూట్​ ఏటీఎం, టాటా ఇండిక్యాష్​, ఇండియా వన్ ఏటీఎం పొంది ఉన్నాయి. కనుక మీరు ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ పొందాలంటే.. ఈ కంపెనీల వెబ్​సైట్​లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  • టాటా ఇండిక్యాష్ : http://www.indicash.co.in
  • ముత్తూట్ ఏటీఎం : www.muthootatm.com
  • ఇండియా వన్​ ఏటీఎం : https://india1payments.in/rent-your-space/

టాటా ఇండిక్యాష్​ ద్వారా ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా మీరు రూ.2 లక్షల రిఫండబుల్​ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. దీనికి అదనంగా వర్కింగ్ క్యాపిటల్ డిపాజిట్​ కింద రూ.3 లక్షలు చెల్లించాలి. అంటే ఎస్​బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకునేందుకు మీరు రూ.5 లక్షలు వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

డబ్బులు ఎలా వస్తాయి?
SBI ATM Transaction Earnings Structure : ఏటీఎంలో చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్​కు రూ.8; ప్రతి నాన్​-క్యాష్​ ట్రాన్సాక్షన్​కు రూ.2 చొప్పున లభిస్తాయి. ఉదాహరణకు మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంలో ఒక రోజుకు కనీసం 250 ఆర్థిక లావాదేవీలు చొప్పున జరిగితే.. మీకు నెలకు సుమారుగా రూ.45 వేలు వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఒక రోజుకు 500 చొప్పున ట్రాన్సాక్షన్స్​ జరిగితే.. నెలకు రూ.88 వేలు నుంచి రూ.90 వేలు వరకు ఆదాయం సంపాదించవచ్చు. రోజుకు 300 నుంచి 350 ట్రాన్సాక్షన్స్​ జరిగితే.. నెలకు రూ.60 వేలు వరకు ఆదాయం లభిస్తుంది.

గోల్డ్ లోన్ కావాలా? ఈ అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోండి!

మ్యూచువల్ ఫండ్స్​లో పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.