ETV Bharat / business

డిజిటల్​ లోన్ తీసుకుంటున్నారా? ఇచ్చేవాళ్లు ఫేక్​ బ్యాచ్​ అయితే డేంజర్! ఇలా చెక్​ చేయండి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 5:25 PM IST

How to Ensure the Lender is Genuine in Digital Loan: ఆన్‌లైన్ ద్వారా రుణాలు తీసుకోవడం అనేది ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అడగ్గానే అప్పు లభిస్తున్నప్పటికీ.. తేడా వస్తే ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోయే అవకాశం కూడా ఉంది. లోన్​ యాప్​ల వేధింపులతో ఎంతో మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అందుకే.. ఆన్‌లోన్ తీసుకునే ముందే రుణదాతల గురించి పలు వివరాలు తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

how to ensure the lender is genuine
how to ensure the lender is genuine

How to Ensure the Lender is Genuine in Digital Loan: ఆర్థిక అవసరాల కోసం రుణం తీసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణం. డిజిటల్ లోన్స్ అందుబాటులోకి రావడంతో.. ఒక్క క్లిక్​తో క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. అయితే.. రుణదాతలు సరైన వాళ్లు కాకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నప్పుడు ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం, లోన్ చెల్లించడం ఆలస్యమైతే రుణ గ్రహీతలను వేధించడం, వ్యక్తిగత డేటా చోరీ వంటి ప్రమాదాలు చాలానే ఉంటాయి. ఇవి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అందుకే లోన్ యాప్‌లు, ఇతర ఆన్‌లైన్ లోన్లు తీసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Personal Loan Tips: పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!

గుర్తింపు ఉందా? మన దేశంలో అప్పులు ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆర్‌బీఐ గుర్తింపు పొంది ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థతో కలిసి పనిచేస్తుండాలి. ఇలా గుర్తింపు పొందని సంస్థలు అప్పులు ఇవ్వడానికి వీల్లేదు. డిజిటల్‌ రుణాలు తీసుకునేటప్పుడు ముందుగా ఆ సంస్థ, యాప్‌ ఆర్‌బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది చూసుకోండి. ధ్రువీకరణ సంఖ్య తదితరాలను రిజర్వు బ్యాంకు వెబ్‌సైటులో తనిఖీ చేసుకోవాలి. మనం రుణం తీసుకునేటప్పుడు ఆయా సంస్థలు మన పూర్తి వివరాలను (కేవైసీ) తీసుకుంటాయి. అలాగే, మనమూ రుణ సంస్థ గురించి ఆరా తీయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

కస్టమర్ల రివ్యూను వెరిఫై చేయాలి: డిజిటల్ లెండర్ గురించి తెలుసుకోడానికి.. ఆన్‌లైన్ ఫోరమ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, రివ్యూ వెబ్‌సైట్‌లలో కస్టమర్ రివ్యూలు అండ్​ ఫీడ్‌బ్యాక్​ను చూడండి. మునుపటి రుణగ్రహీతల నుంచి వచ్చే సానుకూల, ప్రతికూల రివ్యూలు.. రుణదాత సేవలపై కొంతమేర అవగాహనను అందిస్తాయి. కస్టమర్ల క్రెడిట్ యోగ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ఆమోదాలకు హామీ ఇచ్చే యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే.. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని సదరు సంస్థ ప్రతినిధులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తే.. మరింత జాగ్రత్తగా ఉండండి. నిజమైన రుణదాతలు తరచుగా వారి యాప్‌లో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను జాబితా చేస్తారు. అలాగే ఫిర్యాదుల పరిష్కార నిర్వాహకుని కోసం సంప్రదింపు వివరాలను అందిస్తారు.

లోన్​ అకౌంట్​ క్లోజ్​ చేస్తున్నారా ఈ విషయాలు మర్చిపోకండి

సురక్షిత వెబ్‌సైట్ అండ్​ డేటా రక్షణ: డిజిటల్ రుణదాత వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో తగిన భద్రతా చర్యలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. వెబ్‌సైట్ URLలో "https://" వంటి సూచికలను చూడండి. వారు మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎలా హ్యాండిల్​ చేస్తారు. అలాగే.. ఎలా సేవ్​ చేస్తారో తెలుసుకోడానికి వారి ప్రైవసీ పాలసీని సమీక్షించండి. కస్టమర్​ డేటాను మోసపూరితంగా పొందేందుకు అధిక యాప్ అనుమతులను కోరే చట్టవిరుద్ధమైన డిజిటల్ లోన్ అప్లికేషన్‌ల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఫోన్ కాంటాక్ట్స్​, లోకేషన్​, ఫొటోలకు అనవసరమైన యాక్సెస్‌ను పరిమితం చేయడం ద్వారా మీ ప్రైవసీని రక్షించుకోండి.

పారదర్శక సమాచారం: నిజమైన డిజిటల్ రుణదాతలు లోన్ ఉత్పత్తులు, నిబంధనలు, వడ్డీ రేట్లు, ఫీజులు, రీపేమెంట్ షెడ్యూల్‌లు మొదలైనవాటిపై పారదర్శకంగా వివరాలను అందిస్తారు. రుణదాత వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా అందజేస్తుందనే విషయాన్ని కన్ఫర్మ్​ చేసుకోండి. "ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల విషయంలో, KFS ఫార్మాట్ ప్రకారం ప్రస్తుత రేటు ఆధారంగా వార్షిక శాతం రేటు (APR) బహిర్గతం అవుతుంది. అయితే, ఫ్లోటింగ్ రేటు మారినప్పుడు, సవరించిన APR వర్తించే ప్రతిసారీ SMS/ఇ-మెయిల్ ద్వారా కస్టమర్‌కు ఇన్ఫార్మ్​ చేస్తారని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. ఈ విషయాలన్నీ సరిచూసున్న తర్వాతనే.. డిజిటల్ లోన్​ తీసుకునేందుకు అడుగు ముందుకు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

How To Get Business Loan : బిజినెస్​ లోన్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!

ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్​ పండుగ ఆఫర్స్​.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్​బ్యాక్స్​ కూడా..

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.