How to Earn Google Opinion Rewards : మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండి.. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్ మీ కోసమే వేచి చూస్తోంది. జస్ట్ ఒక్క యాప్ డౌన్లోడ్ చేసి.. కొన్ని సెకన్లు దాని కోసం వెచ్చిస్తే సరిపోతుంది. డబ్బులు ( Free Money Earning App ) మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. యాప్ అంటే.. ఏదో సాదాసీదా యాప్ కాదు. టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన యాప్ అది. ఇప్పటికే 5 కోట్ల డౌన్లోడ్స్ సొంతం చేసుకున్న ఆ యాప్ గురించి తెలుసుకుందాం పదండి.
Google Rewards Survey Telugu : 'గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్' అనే యాప్.. స్మార్ట్‌ఫోన్ యూజర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్‌లో వచ్చే చిన్న చిన్న సర్వేలకు అభిప్రాయాలు చెప్పడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఒక్కో సర్వే పూర్తి చేయగానే.. కొంత మొత్తం రివార్డ్ రూపంలో మీ ఖాతాలో పడిపోతుంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకైతే పేపాల్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ అకౌంట్లోకి మనీ క్రెడిట్ చేస్తారు.
యాప్ వాడకం ఇలా..
Google Opinion Rewards App
- ప్లే స్టోర్‌లో (లేదా ఐఫోన్ యాప్ స్టోర్‌లో) గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్‌ను వెతికి ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ఓపెన్ చేశాక గూగుల్ ఖాతా నుంచి యాప్‌లోకి సైన్-ఇన్ అవ్వాలి.
- ముందుగా టెస్ట్ సర్వే నిర్వహిస్తారు. సర్వే ఎలా ఉంటుందనే అవగాహన కోసం ఇది చేపడతారు.
- తర్వాత డబ్బులు ఇచ్చే సర్వేలు వస్తాయి. 10 సెకన్ల వ్యవధిలోనే ఈ సర్వేలు పూర్తవుతాయి. ఇటీవల మీరు చేసిన షాపింగ్‌లు, సందర్శించిన వివిధ ప్రదేశాలకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తారు.
- సర్వే పూర్తి కాగానే కొంత డబ్బు ఖాతాలో పడుతుంది. ఇలాగే సర్వేలకు సమాధానాలు చెబుతూ ఉంటే.. పెద్ద మొత్తం పోగవుతుంది.
ఈ సర్వే వివరాలు ఎందుకు?
Google Opinion Rewards India : ఈ సమాచారంతో గూగుల్.. తన ప్రొడక్ట్‌లను మరింత మెరుగుపర్చుకుంటుంది. గూగుల్ మ్యాప్స్‌ను ఇంప్రూవ్ చేసేందుకు ఈ డేటాను ఉపయోగించుకుంటుంది. ఈ యాప్.. జీపీఎస్, వైఫై, బ్లూటూత్, మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటుంది. ప్రైవసీ విషయంలో ఇబ్బందులు లేని వారు ఈ యాప్‌ను ట్రై చేయొచ్చు.
ఒపీనియన్ రివార్డ్స్‌లో ఎక్కువ సర్వేలు రావాలంటే?
Google Opinion Rewards Unlimited Surveys : సర్వేలు పూర్తి చేస్తే రివార్డ్స్ వస్తాయి కాబట్టి.. ఎక్కువ సర్వేలు పూర్తి చేయడం ముఖ్యం. సాధారణంగా పరిమిత సంఖ్యలోనే ఈ సర్వేలు వస్తుంటాయి. యూజర్లను బట్టి కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ సర్వేలు కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించండి.
- గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్‌కు లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి.
- ఇలా చేస్తే.. మీ లొకేషన్ హిస్టరీ ఆధారంగా ఎక్కువ సర్వేలు వచ్చే వీలుంది.
- లొకేషన్ హిస్టరీతో పాటు లొకేషన్ యాక్యూరసీని ఆన్‌లో ఉంచుకోవాలి.
- గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి.
- యాప్‌ను రోజూ చెక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.
- వచ్చిన సర్వేలను వెంటనే పూర్తి చేయండి.
- అధికంగా ఖర్చు పెట్టేవారికి, షాపింగ్ చేసే మహిళలకు సర్వేలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.
- కాబట్టి రెగ్యులర్‌గా షాపింగ్‌లకు వెళ్లే వారికి, ప్రముఖ స్టోర్లను సందర్శించే వారికి ఇదెంతో ఉపయోగకరం.
- ఎక్కువ సేపు ఇంట్లోనే కూర్చునేవారికి పెద్దగా సర్వేలు రావు.
ఒపీనియన్ రివార్డ్స్‌కు ఏ ప్రాంతంలో ఉంటే బెస్ట్?
- గ్రామాలతో పోలిస్తే నగరాల్లో నివసిస్తూ యాక్టివ్‌గా ఉండేవారికి సర్వేలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
- సిటీలో మన మొబైల్ ఫోన్ ఎన్ని లొకేషన్లలో చెక్-ఇన్ అయిందనే వివరాల ఆధారంగా కొత్త సర్వేలు వస్తాయి.
- యాక్టివ్‌గా వివిధ ప్రాంతాలు సందర్శించడం, షాపింగ్ చేయడం అలవాటు ఉన్నవారికి కాస్త ప్రయోజనం ఉంటుంది.
ఫేక్ సర్వేలతో జాగ్రత్త!
సర్వేలలో నిజం చెప్పడానికే ప్రయత్నించండి. కొన్నిసార్లు తప్పుడు సమాధానాలను గుర్తించేందుకు ఫేక్ సర్వేలను కూడా ఇస్తుంటుంది. ఉదాహరణకు ఒక లొకేషన్లోని స్టోర్ గురించి ప్రశ్నలు అడుగుతూ ఫేక్ సర్వే ఇచ్చిందనుకుందాం. మీకు దాని గురించి తెలియక.. ఏదో ఒక సమాధానం చెప్పారంటే పప్పులో కాలేసినట్టే. కాబట్టి, తెలిసిన వాటికి మాత్రం నిజాయితీగా సమాధానాలు ఇవ్వండి.
పండగ సీజన్లలో బెస్ట్..
- సెప్టెంబర్- డిసెంబర్ మధ్య గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్‌లో ఎక్కువ సర్వేలు వస్తుంటాయి.
- పండగలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా షాపింగ్ చేస్తారు కాబట్టి.. సర్వేలు అధికంగా ఇస్తుంటుంది గూగుల్.
- ఈ సమయంలో వివిధ కంపెనీలు కూడా యూజర్ల అభిరుచులు తెలుసుకునేందుకు గూగుల్ ద్వారా సర్వేలు చేయిస్తాయి.
వీడియోలు చూస్తే డబ్బులు..
సర్వేలతో పాటు వీడియోలు చూపించి కూడా గూగుల్ అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఒక వీడియో పంపించి దాన్ని చూసిన తర్వాత రేటింగ్ ఇవ్వమని కోరుతుంది. గూగుల్ పంపిన సమయంలోనే ఆ వీడియోను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీడియో చూసి రేటింగ్ ఇచ్చే వీలు ఉండదు.
- వీడియో చూసిన తర్వాత అది సరిగానే ప్లే అయిందా లేదా అన్నది నిర్ధరించాలి. తర్వాత దానికి రేటింగ్ ఇవ్వాలి.
- వెంటనే రివార్డ్ మీ ఖాతాలో చేరిపోతుంది. గూగుల్ సర్వేలు పూర్తి చేస్తే వీడియో రికమెండేషన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- యూట్యూబ్ ఫీడ్‌ను మెరుగుపర్చేందుకు ఈ డేటాను ఉపయోగించుకుంటుంది గూగుల్.
- యాడ్స్ కోసం కాకుండా వ్యక్తిగత రికమెండేషన్లను మెరుగుపర్చేందుకు దీన్ని ఉపయోగించుకుంటుంది.
- ఒక్కో వీడియో సర్వేకు 30 సెంట్లు (76 పైసలు) చెల్లిస్తారు. కాబట్టి, వీటిని పూర్తి చేస్తే మంచి రివార్డ్ లభించినట్టే.
రివార్డ్స్ ఎక్కడ వాడుకోవచ్చు?
Google Rewards Redeem :
- గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్‌లో సంపాదించిన ఈ డబ్బు ప్లే స్టోర్‌లో వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది.
- ప్లే స్టోర్‌లో పుస్తకాలు, యాప్‌లు, గేమ్‌లు, సినిమాలను కొనుక్కునేందుకు ఈ బ్యాలెన్స్ వాడుకోవచ్చు
- ప్లే స్టోర్‌లో 'గూగుల్ ప్లే బ్యాలెన్స్'ను పేమెంట్ సోర్స్‌గా సెలెక్ట్ చేసుకొని చెల్లింపులు చేసెయొచ్చు.
డబ్బులు అయిపోతాయ్.. జాగ్రత్త!
గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్‌లో వచ్చే క్రెడిట్స్ 12 నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. వాటిని ఉపయోగించకుండా అలాగే ఉంచితే.. చేసిన కష్టమంతా వృథా అయిపోతుంది. కాబట్టి, గూగుల్ ప్లేలో ఏం కొనుక్కోవాలో ముందుగానే నిర్ణయించుకోవడం మంచిది.
How to Earn Money as a Student : చదువుకుంటూనే సంపాదించాలా..? ఎన్ని మార్గాలున్నాయో..!
ఈ రివార్డ్స్‌ను బెస్ట్‌గా వినియోగించండి.
గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్‌ను ఖర్చు చేయడానికి మంచి ప్లాన్ వేసుకోండి. రివార్డ్స్ ఖర్చు చేయడానికి బెస్ట్ మార్గాలు ఇవే.
- ఎడ్యుకేషన్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం
- మూవీ లేదా పుస్తకం కొనడం
- హై-ఎండ్ గేమ్స్ కొనుక్కోవడం
- యాప్‌ను యాడ్-ఫ్రీకి అప్‌గ్రేడ్ చేసుకోవడం
- గూగుల్ ఒన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం
Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్!
డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం ఎలా?