ETV Bharat / business

మీరు ఉద్యోగులా? మీ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును సింపుల్​గా లెక్కించండిలా! - How to Calculate ITR

How To Calculate Income Tax On Your Salary In Telugu : మీరు ఉద్యోగులా? మీరు సంపాదిస్తున్న జీతంపై ఎంత ఆదాయ పన్నును కట్టాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన ఆదాయ పన్నును సులువుగా ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Income and Tax Calculator
How To Calculate Income Tax On Your Salary
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 12:00 PM IST

How To Calculate Income Tax On Your Salary : భారతదేశంలో ఆదాయ పన్ను లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా నెలవారీ జీతాలు సంపాదించే ఉద్యోగులు, తాము కట్టాల్సిన ఇన్​కం టాక్స్ గురించి లెక్కలు వేసుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. కానీ, ఆదాయ పన్నును సరిగ్గా లెక్కించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మన వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి, పన్ను నిబంధనలను సక్రమంగా పాటించడానికి ఇది చాలా అవసరం. అందుకే ఈ ఆర్టికల్​లో ఉద్యోగాలు తమ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును ఎలా లెక్కించాలో తెలుసుకుందాం.

Income Tax Calculation Process :

  • స్టెప్​ 1 : మీకు వచ్చే స్థూల ఆదాయం (గ్రాస్​ సాలరీ)ని లెక్కించండి. దీనిలో మీ బేసిక్ సాలరీ, అలవెన్సులు, బోనస్​లు, పన్ను విధించదగిన ఇతర అంశాలు ఉంటాయి.
  • స్టెప్​ 2 : మీరు సంపాదించిన జీతంలో ఇంటి అద్దె భత్యం​ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్​ (LTA) సహా, కొన్ని ప్రామాణిక అంశాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అందుకే వీటిని మీ గ్రాస్ సాలరీ నుంచి తీసివేయండి.
  • స్టెప్​ 3 : ఇన్​కం టాక్స్ యాక్ట్, సెక్షన్​ 80సీ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ (PPF), జీవిత బీమాల్లో చేసిన ఇన్వెస్ట్​మెంట్స్​పై పన్ను తగ్గింపులు వర్తిస్తాయి. సెక్షన్​ 80డీ ప్రకారం ఆరోగ్య బీమా ప్రీమియంలపై; సెక్షన్ 24బీ ప్రకారం గృహరుణం వడ్డీలపై పన్ను తగ్గింపులు ఉంటాయి. కనుక ఈ టాక్స్ డిడక్షన్​లను కూడా మీ గ్రాస్ సాలరీ నుంచి తీసివేయాలి. అప్పుడు పన్ను విధించదగిన మీ నికర ఆదాయం ఎంతో తెలుస్తుంది.
  • స్టెప్​ 4 : భారతదేశంలో ప్రగతిశీల పన్ను విధానాన్ని అవలంభిస్తున్నారు. దీని ప్రకారం వివిధ ఆదాయ స్లాబ్​లను నిర్ణయించారు. ఈ స్లాబ్​లను అనుసరించి, సంబంధిత పన్ను రేట్లను కట్టాల్సి ఉంటుంది. కనుక మీరు ఏ ఆదాయ స్లాబ్​లోకి వస్తున్నారో చూసుకుని, అందుకు తగ్గట్టుగా ఇన్​కం టాక్స్​ను లెక్కించాల్సి ఉంటుంది.
  • స్టెప్​ 5 : మీరు పై లెక్కలన్నీ చూసుకున్న తరువాత టాక్స్ లయబిలిటీ (పన్ను బాధ్యత)ను లెక్కించాల్సి ఉంటుంది. మీరు ఏ స్లాబ్​లోకి వస్తున్నారో చూసుకుని, అందుకు తగ్గట్టుగా ఎంత ఆదాయ పన్ను చెల్లించాలో లెక్కించాలి.
  • స్టెప్ 6 : మీకు ప్రభుత్వం ఏమైనా రాయితీలు కల్పిస్తే వాటిని గ్రాస్ సాలరీ నుంచి తీసివేయాలి. అలాగే మీరు కట్టాల్సిన సర్​ఛార్జీలు ఏవైనా ఉంటే వాటిని యాడ్ చేయాలి. ఉదాహరణకు మీ ఆదాయం రూ.7 లక్షలలోపు ఉంటే, సెక్షన్​ 87ఏ ప్రకారం, మీకు పన్ను రాయితీ లభిస్తుంది.
  • స్టెప్​ 7 : మీరు కట్టాల్సిన పన్ను (టాక్స్ లయబిలిటీ)కి ఆరోగ్యం, విద్య సెస్​లను కలపండి. (ప్రస్తుతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్​ 4 శాతం వరకు ఉంది.)
  • స్టెప్​ 8 : పై అంశాలన్నింటినీ గణిస్తే, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుస్తుంది.
  • స్టెప్ 9 : మీరు ఉద్యోగులు కనుక, మీ యజమాని ప్రతి నెలా మీ జీతం నుంచి మూలం వద్ద (TDS)ను మినహాయిస్తాడు. ఈ టీడీఎస్​ను మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లయబిలిటీతో సర్దుబాటు చేస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన పన్ను రూ.10,000 దాటితే, మీరు వాయిదాల్లో ఎడ్వాన్స్ టాక్స్​ చెల్లించాల్సి రావచ్చు.
  • స్టెప్​ 10 : చివరిగా అన్ని లెక్కలను సరిచూసుకుని, ఆదాయ పన్ను శాఖవారికి మీ ఇన్​కం టాక్స్​ రిటర్నులను (ITR)ను దాఖలు చేయండి. అందులో మీ ఆదాయం, పన్ను మినహాయింపులు, తగ్గింపులు, పన్ను చెల్లింపు వివరాలను నివేదించండి.

మీరు ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లోని కాలిక్యులేటర్ ఉపయోగించి, సింపుల్​గా మీరు కట్టాల్సిన ఇన్​కం టాక్స్​ను లెక్కించవచ్చు. మీకు గనుక దీనిపై తగినంత అవగాహన లేకపోతే, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్​ను సంప్రదించండి. వారు మీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆదాయ పన్నులను లెక్కిస్తారు. దీనితో సింపుల్​గా మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి వీలవుతుంది.

బెస్ట్ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డ్​ ఎంచుకోవాలా? టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

నయా సైబర్​ స్కామ్​ - ఆ నంబర్​కు కాల్​​ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.