ETV Bharat / business

Youtube Earnings : యూట్యూబ్​ ఛానల్​కు లక్ష సబ్​స్క్రైబర్లు​ ఉంటే.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? - యూట్యూబ్ సూపర్​ చాట్​

1 Lakh Subscribers Youtube Income : ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్​ తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి మొబైల్​లో తప్పక ఉండే యాప్​లలో ఇదీ ఒకటి​. అయితే ఇది వినియోగదారులకు కేవలం వినోదాన్ని అందించే అప్లికేషన్​ మాత్రమే కాదు.. భారీ మొత్తంలో డబ్బును సంపాదించే ఆదాయ మార్గంగా కూడా మారిపోయింది. అయితే ఒక యూట్యూబ్​ ఛానల్​కు లక్ష.. ఆపై సబ్​స్క్రైబర్లు ఉంటే ఆ యూట్యూబర్​కు ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలుసా..?

How Much Money For 1 Lakh Subscribers On Youtube In India In Telugu
ఒక యూట్యూబ్​ ఛానల్​కు లక్ష సబ్​స్క్రైబర్స్​ ఉంటే ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?
author img

By

Published : Jul 30, 2023, 3:18 PM IST

1 Lakh Subscribers In Youtube Income In India : డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం అవసరం. మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించాలంటే చదువు తప్పనిసరి. అయితే ఏదైనా ఉద్యోగం చేయాలంటే కనీస విద్యార్హతలు ఉండాలి. కానీ చదువుతో సంబంధం లేకుండా.. కేవలం ఒక యాప్​ ద్వారానే నెలకి లక్షల్లో డబ్బును సంపాదిస్తున్నారు చాలా మంది. మరి అంత పెద్ద మొత్తాల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఆ యాపే 'యూట్యూబ్​'. కాస్త సృజనాత్మకత, ప్రతిభ ఉంటే చాలు కొత్తగా యూట్యూబ్​ ఛానల్​ను ప్రారంభించి వివిధ రకాల కంటెంట్​లను అందులో పోస్ట్​ చేస్తున్నారు ఔత్సాహికులు.

కంటెంటే ప్రధానం..
How Much Money For 1 Lakh Subscribers : ఓ యూట్యూబ్​ ఛానల్​కు సబ్​స్క్రైబర్లు పెరగాలన్నా, వ్యూవర్​షిప్​ రావాలన్నా వారు అప్లోడ్​ చేసే కంటెంట్ చాలా బాగుండాలి. కొందరు కామెడీ, మరికొందరు గేమింగ్​, ఇంకొందరు వంటలు ఇలా రకరకాల కంటెంట్​లతో యూజర్స్​కు కావాల్సిన వీడియోలను పోస్ట్​ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా కొద్ది కాలంలోనే ఫేమస్​ యూట్యూబర్స్​గా ఎదుగుతున్నారు చాలా మంది. అయితే ఇలా యూట్యూబ్​ ద్వారా డబ్బు సంపాదించడమంటే అంత సులువైన విషయం కాదు. మనం అప్లోడ్​ చేసే కంటెంట్​లో కొత్తదనంతో పాటు వైవిధ్యంగా ఉంటేనే ఆ వీడియోలకి ఆదరణ లభిస్తుంది. తద్వారా మన ఛానల్​కు సబ్​స్క్రైబర్లు పెరుగుతారు.. వీక్షకులూ పెరుగుతారు. ఇవే ప్రధానంగా ఓ యూట్యూబర్​కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరులు. ఇదిలా ఉంటే ఒక యూట్యూబ్​ ఛానల్​కు 1 లక్ష.. ఆపై సబ్​స్క్రైబర్స్​ ఉంటే ఆ యూట్యూబర్​​కు ఎంత మేరకు డబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Lakh Subscribers Income : ఒక యూట్యూబ్​ ఛానల్​కు 1 లక్ష సబ్​స్క్రైబర్లు ఉంటే ఆ యూట్యూబర్​కు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు సొమ్మును చెల్లిస్తుంది యూట్యూబ్​. అయితే ఈ చెల్లింపులు ఒక్కో ఛానల్​ పోస్ట్ చేసే కంటెంట్​కు వచ్చిన వ్యూస్​, ఆ ఛానల్​కు ఉన్న సబ్​స్క్రైబర్స్ సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది. అలా ఒక్కో యూట్యూబర్​ లక్షల్లో కూడా సంపాదించవచ్చు.

కంటెంట్​ ద్వారానే కాదు..
How Much Money For 1 Lakh Subscribers On Youtube :ప్రస్తుతం మనం చూసే యూట్యూబ్​ వీడియోస్​లలో చాలా వరకు యాడ్స్​ కూడా ​కనిపిస్తుంటాయి. వీటినే పెయిడ్​ ప్రమోషన్స్​ అంటారు. అంటే ఓ యూట్యూబర్​ ఫేమస్​ అయితే గనుక అతడితో ఓ సంస్థ తన ప్రాడక్ట్స్​ను ప్రచారం​ చేయించుకుంటుంది. అలా ఓ వస్తువును ప్రమోట్​ చేసిన కంపెనీ నుంచే కాకుండా యూట్యూబ్​ నుంచి కూడా డబ్బును సంపాదించుకోవచ్చు. ఇలా యాడ్స్​, స్పాన్సర్​షిప్స్​ సహా వ్యాపారానికి సంబంధించిన వీడియోస్​ను కంటెంట్​ మొదట్లో కానీ, మధ్యలో కానీ అప్లోడ్​ చేసిన ఛానళ్లు.. మానిటైజ్​ చేసుకునే వీలును కూడా కల్పిస్తుంది యూట్యూబ్​.

యూట్యూబ్​ యాడ్​సెన్స్​..
Youtube Adsense : యూట్యూబ్​లో ఓ ఛానల్​ మానిటైజేషన్​కు అర్హత సాధించాలంటే ఆ ఛానల్​కు కనీసం 1000 మంది సబ్​స్క్రైబర్లు ఉండాలి. అలాగే వారు అప్లోడ్​ చేసిన కంటెంట్​ను 12 నెలల్లో 4000 గంటలపాటు చూసి ఉండాలి. ఇలా యూట్యూబ్​ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధిస్తే.. సదరు యూట్యూబ్ ఛానల్​కు యాడ్​సెన్స్​ అప్రూవ్ అవుతుంది. దీనితో సదరు​ యూట్యూబర్​కు​ యాడ్​ రెవెన్యూలో కొంత భాగాన్ని యూట్యూబ్​ ఇస్తుంది. అంతే కాకుండా లైవ్​స్ట్రీమ్​ సమయంలో చేసే సూపర్​ చాట్ లేదా కామెంట్​​ల ద్వారా కూడా కంటెంట్​ క్రియేటర్లకు డబ్బులు వస్తాయి. మరోవైపు యాడ్​-ఫ్రీ వీడియోలను చూసేందుకు యూజర్లు చెల్లించే యూట్యూబ్​ ప్రీమియం మొత్తంలో నుంచి కూడా కొంత డబ్బును వీడియో క్రియేటర్​ ఖాతాలో జమ చేస్తారు.

యూట్యూబర్​ - ఆదాయ మార్గాలు

  • ప్రకటనలు (యాడ్స్​)
  • షాపింగ్​
  • యూట్యూబ్​ ప్రీమియం
  • ఛానల్​ మెంబర్​షిప్స్​
  • సూపర్​ చాట్​ అండ్​ సూపర్​ స్టికర్స్​
  • సూపర్​ థ్యాంక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.