ETV Bharat / business

ల్యాప్స్‌ అయిన పాలసీలతో మోసాలు.. మీకు కూడా ఈ అనుభవం ఎదురైందా? - ఇన్సూరెన్స్​ పాలసీలు ల్యాప్స్​

ల్యాప్స్‌(రద్దు) అయిన పాలసీలు కలిగిన పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం.

lapsed insurance policies
lapsed insurance policies crimes
author img

By

Published : Oct 31, 2022, 1:36 PM IST

బీమా అంబుడ్స్‌మెన్‌ వద్దకు వచ్చే ఫిర్యాదుల్లో అధిక శాతం మిస్‌-సెల్లింగ్‌ గురించే ఉంటున్నాయి. అందులోనూ ల్యాప్స్‌ (రద్దు) అయిన పాలసీలు కలిగిన పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. 2021లో మిస్‌-సెల్లింగ్‌ గురించి అందిన ఫిర్యాదుల్లో 20 శాతం ల్యాప్స్‌ అయిన పాలసీలకు సంబంధించినవి కాగా.. ఈ ఏడాది అవే ఫిర్యాదులు 40 శాతం ఉన్నాయి. గత తొమ్మిది నెలల్లో ల్యాప్స్‌ అయిన పాలసీల గురించి 730కు పైగా ఫిర్యాదులు అందినట్లు సంబంధింత నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మిస్‌-సెల్లింగ్‌ అంటే ఏంటి? ల్యాప్స్‌ అయిన పాలసీలను అడ్డుపెట్టుకుని ఏ విధంగా మోసాలకు పాడ్పడుతున్నారో తెలుసుకుందాం.

మిస్‌-సెల్లింగ్‌ అంటే..?
మీరు ఒక మోడల్‌ బైక్‌ కొందామనుకుని వెళ్లారు. కానీ తీరా షోరూమ్‌కి వెళ్లాక.. అక్కడ సిబ్బంది మీరు అనుకున్న వాహనం కాకుండా మెరుగైన ఫీచర్లతో మరొక వాహనాన్ని చూపించి విక్రయించేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా మంచి ఫీచర్లు ఉన్నాయని, దీర్ఘకాల అవసరాల కోసం వాహనం సరిపోతుందని నమ్మి కొనుగోలు చేస్తారు. కానీ తీరా కొనుగోలు చేసి కొంత సమయం గడిచిన తర్వాత తెలుస్తుంది. ఆ వాహనం మీ అవసరాలకు తగినట్లుగా లేదని, వారు చెప్పిన ఫీచర్స్ ఇందులో లేకపోవడం/సరిగ్గా పని చేయకపోవడం లాంటివి గ్రహిస్తారు. దీంతో మీరు డబ్బు నష్టపోతారు.

బీమాలో కూడా అంతే. మీరు జీవిత బీమా కోసం టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందిస్తుంది. కానీ దీంతో బీమా ఏజెంట్లకు పెద్దగా కమీషన్‌ రాదు. అందువల్ల ఎక్కువ కమీషన్‌ కోసం వీటి స్థానంలో ఎండోమెంట్‌, మనీబ్యాక్‌, యులిప్‌ వంటి పాలసీలను విక్రయించేందుకు చూస్తుంటారు. ఇవి అధిక రాబడిని ఇస్తాయని చెబుతుంటారు. ఇలాంటి పాలసీలకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాబడి కూడా తగినంత ఉండదు. కానీ కమీషన్‌ కోసం, టార్గెట్లు చేరుకోవడం కోసం కొందరు ఏజెంట్లు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తుంటారు. దీన్నే మిస్‌-సెల్లింగ్‌ అంటారు.

లాప్స్‌ అయిన పాలసీలతో మిస్‌-సెల్లింగ్‌..
ఈ విషయాన్ని ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిత్‌ తీసుకున్న జీవిత బీమా పాలసీకిగాను కొంత కాలం ప్రీమియంలు సరిగ్గానే చెల్లించాడు. కొంత కాలం తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియం చెల్లింపులు చేయలేకపోయాడు. దీంతో పాలసీ ల్యాప్స్‌ అయ్యింది. రోహిత్‌కు బీమా ఏజెంట్‌ ఫోన్‌ చేసి.. 'మీ ల్యాప్స్‌ అయిన పాలసీ నుంచి బోనస్‌ వస్తుంది. కానీ బోనస్‌ క్లెయిమ్‌ చేసేందుకు పాలసీని పునరుద్ధరించాలి. ఇందుకు కొంత మొత్తం చెల్లించాలి' అని చెప్పాడు. రోహిత్‌ కూడా పాలసీ పునరుద్ధరణ కోసం ఏదోలా డబ్బు ఏర్పాటు చేసి చెల్లించాడు. ఇది పూర్తయిన తర్వాత 'బోనస్‌ మొత్తం పొందేందుకు మీరు ఓ కొత్త పాలసీని కూడా తీసుకోవాల్సి ఉంటుంద'ని చెప్పడంతో రోహిత్ మరొక కొత్త పాలసీ తీసుకున్నాడు. ఈ విధంగా రోహిత్‌ మధ్యవర్తుల మాటలు విశ్వసించి ల్యాప్స్‌ అయిన పాలసీల ప్రీమియం కోసం చాలా మొత్తాన్ని ఖర్చు చేశాడు. ఈ విషయం గ్రహించేలోపు అనేక పాలసీలు కొనుగోలు చేశాడు. అయితే, ఏ ఒక్క పాలసీ కూడా అతడి అవసరాలకు తగినట్లుగా ఉండదు.

మరొక ఉదాహరణ తీసుకుంటే.. శ్యామ్‌కి, తాను తీసుకున్న బీమా పాలసీ గురించి కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తాను బీమా సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నానని, మీరు చాలా కాలం నుంచి పాలసీని కొనసాగించిన తర్వాత పాలసీ ల్యాప్స్‌ అయినందున.. సంస్థ మీకు రూ. 10 లక్షల ప్రయోజనాన్ని అందిస్తుందని.. దీని కోసం మీరు మరొక పాలసీని తీసుకోవాలని చెప్పాడు. అయితే, ఇక్కడ శ్యామ్‌ తీసుకున్న సంస్థ నుంచి కాకుండా మరొక సంస్థ నుంచి పాలసీ తీసుకోవాలని టెలికాలర్‌ చెప్పడంతో శ్యామ్‌కి సందేహం కలిగి దాని గురించి అడిగాడు. మీ ప్రస్తుత బీమా సంస్థ, కొత్త సంస్థతో టైప్-అప్‌ అయినందున ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు చెప్పి నమ్మించి పాలసీ కొనుగోలు చేసేందుకు ఏజెంట్ ఒప్పిస్తాడు. ఈ విధంగా పాలసీదారులను నమ్మిస్తున్నారు.

మోసాల బారిన పడకుండా..
బీమా సంస్థల్లో అంతర్గతంగా జరిగే తప్పుల వల్ల గానీ, సైబర్‌ ఎటాక్‌ వల్ల గానీ పాలసీదారుల సమాచారం టెలికాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుత పాలసీ వివరాలను తెలియజేయడంతో పాలసీదారులు కూడా వారిని సులభంగా నమ్ముతున్నారు. కాబట్టి, ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. పాలసీదారులు మధ్యవర్తులు, ఏజెంట్లు, టెలికాలర్ల మాటలు విని కాకుండా.. తమ అవసరాలకు తగిన పాలసీల గురించి తెలుసుకోవాలి. నేరుగా బీమా సంస్థ నుంచి గానీ, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల ద్వారా గానీ కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఏజెంట్‌ కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రీమియం కూడా కొంత వరకు తగ్గుతుంది. ఒకవేళ బీమా ఏజెంట్‌ ద్వారా కొనుగోలు చేసినా, పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదవాలి. ఏజెంట్‌ చెప్పిన సమాచారం మొత్తం సరైనదేనని నిర్ధారించుకోవాలి. పాలసీ పత్రాలను సంతకం చేసి ఇచ్చేయకుండా, పూర్తి సమాచారంతో (తప్పులు లేకుండా, దాపరికాలు లేకుండా) స్వయంగా పత్రాలను పూర్తిచేసి ఇవ్వాలి.

ఫిర్యాదు చేయవచ్చు..
ఒకవేళ మీరు ఇలాంటి మిస్‌-సెల్లింగ్‌ మోసాల బారిన పడితే బీమా కంపెనీకు ఫిర్యాదు చేయవచ్చు. సరైన పరిష్కారం లభించకపోతే బీమా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కొన్నిసార్లు బ్యాంకులు కూడా మిస్‌-సెల్లింగ్‌కు పాల్పడుతుంటాయి. రుణాలు ఇవ్వాలన్నా, డిపాజిట్‌ నుంచి డబ్బు తీసుకోవాలన్నా బీమా కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తుంటాయి. అలా బ్యాంకు అధికారులు ఎవరైనా ఒత్తడి చేసినా ఫిర్యాదు చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.