Loan Fraud Detection and Solution : నేటి కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరుగుతూ ఉంటే.. మోసాలు కూడా అంత కంటే ఎక్కువగానే పెరిగిపోతున్నాయి. మీకు తెలియకుండానే మీ కేవైసీ పత్రాలు ఉపయోగించి, వేరొకరు అక్రమంగా మీ గుర్తింపును (ఐడెంటిటీ) తస్కరిస్తున్నారు. అలాగే మీ ఐడెంటిటీతో బ్యాంకు రుణాలు పొందుతున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో బాధితులు ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఐడెంటిటీని దొంగిలిస్తున్నారు!
Identity theft and fraud : ఇటీవలి కాలంలో చాలా మంది మోసగాళ్లు మనకు తెలియకుండానే, మన ఐడెంటిటీని దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా మన పాన్, ఆధార్ నంబర్లను అక్రమంగా ఉపయోగించుకుని, వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. దీని వల్ల ఏమీ తెలియని అమాయకులు ఆర్థికంగా, చట్టపరంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు వారి క్రెడిట్ స్కోర్ కూడా బాగా దెబ్బతింటోంది. అందుకే మీ పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు దుర్వినియోగానికి గురవుతున్నాయని మీరు భావిస్తే, వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ రిపోర్ట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయాలి
Credit score check for free : మీరు కచ్చితంగా మీ క్రెడిట్ రిపోర్టును కనీసం సంవత్సరానికి 2 లేదా 3 సార్లు అయినా చెక్ చేసుకోవాలి. వాస్తవానికి నెలకు ఒకసారి చూసుకున్నా.. మీ క్రెడిట్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బంది రాదు. సెబీ నిబంధనల ప్రకారం, భారత దేశంలోని క్రెడిట్ బ్యూరోలు సంవత్సరానికి ఒక సారి పూర్తి ఉచితంగా బేసిక్ క్రెడిట్ రిపోర్టును అందిస్తాయి. లేదంటే ప్రస్తుతం అనేక ఆన్లైన్ పోర్టల్‌లు ఉచితంగా క్రెడిట్ రిపోర్టులను అందిస్తున్నాయి. వాటిని మీరు చూసుకోవచ్చు. అందులో ఏమైనా మీ ప్రమేయం లేకుండా తీసుకున్న లోన్లు, ఎంక్వైరీలు, క్రెడిట్ అప్లికేషన్లు ఉంటే, కచ్చితంగా వాటిని సరిదిద్దమని క్రెడిట్ బ్యూరోలను కోరవచ్చు. లేదంటే మీ హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించి, పరిష్కారం పొందవచ్చు.
అప్లై చేయకుండానే రుణం మంజూరు అయితే!
Loan Application Fraud Detection : మీరు దరఖాస్తు చేయకుండానే రుణం మంజూరు అయినట్లు లేదా రిజెక్ట్ అయినట్లు.. ఈ-మెయిల్స్, లెటర్స్, ఎస్ఎంఎస్ వస్తే, వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించండి. దానిపై ఎంక్వైరీ చేసి, సమస్యను పరిష్కరించమని స్పష్టంగా చెప్పండి.
బ్యాంకులను నేరుగా సంప్రదించాలి!
Loan fraud complaint : ఒక వేళ ఎవరైనా, మీకు తెలియకుండా మీ పేరుపై రుణాల కోసం అప్లై చేసినా, లేదా రుణాలు పొందినా.. సంబంధిత బ్యాంకు/ రుణ దాతను నేరుగా సంప్రదించండి. జరుగుతున్న మోసాన్ని వివరించండి.
కచ్చితంగా ఫిర్యాదు చేయాలి!
Complaint against fraud loans : మీ ఐడెంటిటీని దొంగిలించి, ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు.. స్పష్టమైన ఆధారాలు ఉంటే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీ దగ్గర ఉన్న ఆధారాలు, సమాచారం మొత్తం పోలీసులకు అందించాలి.
సెక్యూరిటీని పెంచుకోవాలి!
మీ వ్యక్తిగత వివరాలు, పత్రాలు చాలా భద్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆన్లైన్ డాక్యుమెంట్స్ విషయంలో తరచుగా పాస్వర్డ్స్ మారుస్తూ ఉండాలి. అదే విధంగా స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. సున్నితమైన సమాచారాన్ని అత్యవసరమైతే, తప్ప ఇతరులు ఎవ్వరికీ చెప్పకూడదు.
నిపుణుల సలహాలు తీసుకోవాలి!
Legal advise for loan frauds in India : మీ ఐడెంటిటీని వేరొకరు తస్కరించినప్పుడు, ఆర్థిక మోసాలకు పాల్పడినప్పుడు.. మీకు ఏం చేయాలో తెలియకపోతే, వెంటనే న్యాయ నిపుణులను సంప్రదించాలి. వారు ఇలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలో మీకు మార్గనిర్దేశం చేస్తారు. చూశారుగా! ఈ విధంగా మీరు ఆర్థిక మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.