ETV Bharat / business

హోండా షైన్​ 100సీసీ బైక్​ లాంఛ్.. స్ప్లెండర్​ కన్నా తక్కువ ధర.. ఎంతంటే? - హోండా షైన్ 100సీసీ బైక్ 2023 మోడల్

హోండా కంపెనీ భారత్​లో కొత్త బైక్​ను లాంఛ్​ చేసింది. '100 సీసీ షైన్​' బైక్​ను.. బుధవారం ఆవిష్కరించింది. ఈ బైక్​కు సంబంధించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

honda-shine-100cc-bike-2023-model-and-honda-shine-100cc-bike-specifications
Etv Bharat భారత్‌లో విడుదలైన హోండా షైన్ 100సీసీ బైక్​
author img

By

Published : Mar 15, 2023, 6:35 PM IST

Updated : Mar 15, 2023, 7:06 PM IST

హోండా కంపెనీ '100 సీసీ షైన్​' బైక్​ను బుధవారం లాంఛ్​ చేసింది. అతి తక్కువ ధరలో ఈ ద్విచక్ర వాహనాన్ని వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. యాక్టివా హెచ్-స్మార్ట్ తర్వాత.. 2023లో కంపెనీ చేపట్టిన అతిపెద్ద లాంఛ్​ ఇదేనని హోండా సంస్థ వెల్లడించింది.

హోండా షైన్​ 100 సీసీ బైక్ ఎక్స్​ షో రూం ధర రూ. 64,900(ముంబయి). ఇది ఎటువంటి ట్రాఫిక్​లోనైనా ఈజీగా ప్రయాణం చేయగలదు. గ్రామీణ, పట్టణ ప్రాంత వినియోగదారులే లక్ష్యంగా ఈ బైక్​ను తయారుచేశారు. బుధవారమే బుకింగ్​లు ఓపెన్​ అవుతాయని బైక్​ లాంఛ్​ ఈవెంట్​లో హోండా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు చెప్పింది. మే నెలలో వినియోగదారులకు వీటిని డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు.

హోండా 100 సీసీ షైన్​ బైక్​ ఫీచర్స్.

  • హోండా 'షైన్ 100' కొత్తగా అభివృద్ధి చేసిన 100సీసీ ఇంజన్‌ను కలిగి ఉంది.
  • ఈ బైక్​ బెటర్​ పవర్​ను, సామర్థ్యాన్ని కలిగి ఉంది.
  • పీజీఎమ్​ఎఫ్​ఐ సాంకేతికతతో మెరుగైన మైలేజీని ఈ బైక్​ అందిస్తుంది.
  • బైక్ నిర్వహణ సులభంగా ఉంటుందని హోండా కంపెనీ చెబుతోంది.
  • ఈ బైక్​.. వినియోగదారుని ఖర్చులను చాలా వరకు తగ్గిస్తుందని కంపెనీ అంటోంది.
  • ఈ బైక్​ వివిధ రంగులలో అందుబాటులో ఉంటుంది.

హీరో స్ల్పెండర్..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​ సైతం బడ్జెట్​ ధరలో సూపర్ బైక్​ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సూపర్​ స్ల్పెండర్​ XTEC బైక్​ను కొద్ది రోజులు క్రితం విడుదల చేసింది.

హీరో స్ల్పెండర్​ బైక్​ ఫీచర్లు..

  1. ఈ బైక్​ గ్లాస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే రంగుల్లో.. డ్రమ్​, డిస్క్​ రెండు వేరియంట్లలో లభించనుంది.
  2. సాధారణ సూపర్​ స్ల్పెండర్ బైక్​ కన్నా అధిక ఫీచర్లను ఈ కొత్త వెర్షన్​లో అందించింది. బైక్​ డిజైన్​కు వస్తే.. XTEC బాడీ వర్క్​ అచ్చం సూపర్​ స్ల్పెండర్​ను పోలి ఉంటుంది.
  3. పెట్రోల్​ ట్యాంక్​పై కొద్దిగా గ్రాఫిక్​ మార్పులను మాత్రమే చేశారు. ఈ బైక్​కు అల్లాయ్​ వీల్స్​నే వినియోగించారు. అయితే సూపర్​ స్ల్పెండర్​ XTECకు అదనంగా LED హెడ్​ ల్యాంప్​ను ఏర్పాటు చేశారు.
  4. ఇది పగటి పూట కూడా వెలుగుతోంది. ఈ బైక్​లో డిజిటల్​ క్లస్టర్​తో పాటు బ్లూటూత్​ సదుపాయాన్ని కల్పించారు. దీనిలో సూపర్ స్ల్పెండర్​కు ఉపయోగించిన 124.7 సీసీ, సింగిల్​ సిలిండర్ ఇంజిన్​నే వాడారు.
  5. ఇక ధర విషయానికొస్తే.. ఇది సూపర్ స్ల్పెండర్​ ధర కన్నా రూ. 4,250 అధికంగా ఉంది. మార్కెట్​లో దీని ధరను రూ. 83,368 గా నిర్ణయించారు.

Last Updated : Mar 15, 2023, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.