GST Council Meeting Today 2023 : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. మొలాసిస్‌పై వస్తు సేవల పన్ను (GST)ని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అలాగే ఆల్కహాల్‌కు కూడా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన దిల్లీలోని సుష్మ స్వరాజ్ భవన్‌లో జరిగిన 52వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రైతులకు మేలు!
మొలాసిస్‌పై జీఎస్టీ తగ్గింపు వల్ల చెరుకు రైతులకు ప్రయోజనం కలగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా పశువుల దాణా రేట్లు బాగా తగ్గుతాయని ఆమె వివరించారు.
పిండిపదార్థాలపై పన్ను
ప్యాకింగ్ చేసి లేదా లేబుల్ వేసి విక్రయించే.. (70 శాతానికి పైగా మిల్లెట్స్ ఉంటే) పిండిపదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించేందుకు కౌన్సిల్ నిర్ణయించిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే విడిగా (లూస్‌గా) విక్రయిస్తే మాత్రం జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
పన్ను కట్టకతప్పదు!
జీఎస్టీ కౌన్సిల్ .. కార్పొరేట్ సంస్థలు తమ అనుబంధ సంస్థలకు అందించే గ్యారెంటీలపై 18% వరకు జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే కంపెనీకి డైరెక్టర్ వ్యక్తిగత పూచీకత్తు ఇస్తే.. ఎలాంటి పన్ను విధించడం జరగదని స్పష్టం చేసింది.
ఆల్కహాల్‌పై జీఎస్టీ!
పారిశ్రామిక అవసరాల కోసం వాడే అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ (ENA)పై జీఎస్‌టీ వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
వయోపరిమితి పెంచారు..
నేషనల్ బెంచ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT).. ప్రెసిడెంట్, మెంబర్స్ గరిష్ఠ వయస్సును ప్రస్తుతమున్న 67 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది.
ఆన్లైన్ గేమింగ్, కాసినోలపై 28% జీఎస్టీ!
ఆన్లైన్ గేమింగ్, కాసినోలపై 28 శాతం వరకు జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దిల్లీ, గోవా లాంటి రాష్ట్రాలు ఈ విషయాన్ని పునఃసమీక్షించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాయి.
"ఆన్లైన్ గేమ్‌లు, కాసినోల్లో డబ్బులు బెట్టింగ్ చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి సంస్థలు/ వ్యక్తులపై పన్ను విధించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. కనుక ఆన్లైన్ గేమ్స్, గ్యాంబ్లింగ్ నిర్వహించే సంస్థలపై 28 శాతం జీఎస్టీ విధించడం జరుగుతుంది."
- సంజయ్ మల్హోత్రా, రెవెన్యూ సెక్రటరీ
అన్యాయంగా గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీని చంపేస్తున్నారు!
'వాస్తవానికి ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ ఆదాయం రూ.23,000 కోట్లు మాత్రమే. కానీ ప్రభుత్వం వీటిపై రూ.1.5 లక్షల కోట్ల జీఎస్టీ విధిస్తామని చెబుతోంది. దీని వల్ల గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది. పైగా.. దేశంలో స్టార్టప్స్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది తీవ్రమైన అభద్రతా భావాన్ని కలిగిస్తుంది' అని దిల్లీ ఫైనాన్స్ మినిస్టర్ అతిషి తీవ్రంగా విమర్శించారు.
Bikes Launched In October 2023 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. సూపర్ బైక్స్ లాంఛ్.. ధర ఎంతంటే?