ETV Bharat / business

మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు.. రూ.1.47 లక్షల కోట్లు రాబడి - సీజీఎస్​టీ వసూళ్లు

GST Collection September : జీఎస్​టీ వసూళ్లు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సెప్టెంబరు నెలలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్​టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST collection September
జీఎస్​టీ
author img

By

Published : Oct 1, 2022, 3:19 PM IST

GST Collection September : వస్తు, సేవల పన్ను(జీఎస్​టీ) వసూళ్లలో జోరు కొనసాగుతోంది. వరుసగా ఏడో నెల రూ.1,40 వేల కోట్లకుపైగా వసూళ్లు నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్‌లో జీఎస్​టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 సెప్టెంబర్‌లో వసూలైన జీఎస్​టీ వసూళ్లతో పోలిస్తే ఈసారి 26 శాతం పెరిగినట్టు వివరించింది.

ఈ మొత్తంలో సీజీఎస్​టీ వసూళ్లు.. రూ.25,271 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.31,813 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సమీకృత జీఎస్టీ వసూళ్లు.. రూ.80,464 కోట్లు ఉండగా.. సెస్ రూపంలో రూ.10,137 కోట్లు వసూలైనట్లు వివరించింది. ఈసారి ఈ-వేబిల్స్‌లో కూడా రికార్డు నమోదైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. సెప్టెంబర్‌లో రూ.1.1 కోట్ల ఈ-వేబిల్స్‌, ఈ-ఇన్‌వాయిస్‌లలో జీఎస్​టీ వసూళ్లు నమోదైనట్లు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇక రాష్ట్రాల పరంగా వసూళ్లు చూసినప్పుడు తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 12శాతం పెరిగాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరులో రూ.3,494కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు.. గత నెలలో రూ.3,915కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్​టీ వసూళ్లలో 21శాతం వృద్ధి కనిపించింది. ఏపీలో గతేడాది సెప్టెంబరులో రూ.2,595 కోట్లుగా ఉన్న వసూళ్లు.. గత నెలలో రూ.3,132కోట్లకు పెరిగాయి.

తెలుగు రాష్రాల్లో జీఎస్​టీ వసూళ్లు

ఇవీ చదవండి: 1జీ నుంచి 5జీకి ప్రయాణం.. డేటా వేగం కాకుండా ఇంకా ఏమైనా మారతాయా?

తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.