ETV Bharat / business

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. గతేడాది కన్నా 28 శాతం ఎక్కువగా.. - జీఎస్టీ వసూళ్లు జులై

జీఎస్టీ వసూళ్లు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జులై నెలలో రూ.1.48 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST revenue july
GST revenue july
author img

By

Published : Aug 1, 2022, 12:09 PM IST

Updated : Aug 1, 2022, 12:41 PM IST

GST Collection July 2022: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2022 జులై నెలలో రూ.1.48 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని తెలిపింది. గత ఏడాది జులైలో వసూలైన జీఎస్టీ ట్యాక్స్​ కన్నా 28% శాతం అధికంగా ఈ సారి రాబడి వచ్చిందని స్పష్టం చేసింది.

జులైలో వసూలైన రూ.1,48,995 కోట్లలో.. సీజీఎస్టీ రూపంలో రూ.25,751 కోట్లు, ఎస్​జీఎస్టీ రూపంలో రూ.32,807 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.79,518 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో రూ.10,920 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్టీ చెల్లింపులు సులభంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి: హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర నేడు ఎంతంటే..

గుడ్ న్యూస్.. వంట గ్యాస్​ ధర తగ్గింపు.. ఎంతంటే...

Last Updated : Aug 1, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.