ETV Bharat / business

మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.43 లక్షల కోట్లు రాబడి - august gst collection increased 28 percent

జీఎస్టీ వసూళ్లు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆగస్టు నెలలో రూ.1.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST collection August
GST collection August
author img

By

Published : Sep 1, 2022, 1:08 PM IST

GST Collection August: వస్తు, సేవల పన్ను వసూళ్లు వరుసగా ఆరో నెలలోనూ రూ.1.40 లక్షల కోట్లు దాటాయి. ఆగస్టు నెలలో 28 శాతం పెరిగిన పన్ను వసూళ్లు.. రూ.1.43 లక్షల కోట్లు ఖజానాకు జమ అయినట్లు.. కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.
"ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. అందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 24,710 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,951 కోట్లుగా ఉంది. సమీకృత జీఎస్టీ రూ.77,782 కోట్లు, సెస్‌ రూ.10,168 కోట్లు వసూలు అయ్యాయి" అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఆగస్టులో 28 శాతం అధికంగా వసూలైనట్లు వివరించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జీఎస్టీ రాబడులపై ప్రభావం చూపినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.

ఇవీ చదవండి: రైలులో ప్రయాణిస్తున్నారా?.. వాట్సాప్​లో హాయ్‌ అంటే మీకిష్టమైన ఫుడ్​ బెర్త్‌ దగ్గరకే!

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.