ETV Bharat / business

మరమ్మతు ఇక మన ఇష్టం.. కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్​ పెట్టేలా 'రైట్ టు రిపేర్' - థర్డ్‌ పార్టీ మరమ్మతులు

Right to repair: వస్తువుల మరమ్మతును కావాల్సిన చోట చేయించుకునేలా 'రైట్‌ టు రిపేర్‌' విధివిధానాలను రూపొందించేందుకు వినియోగదారు వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు అయింది. వ్యవసాయ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, మన్నికైన వినిమయ వస్తువులు, వాహన విడిభాగాలను ఈ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది.

right to repair
రైట్​ టూ రిపేర్
author img

By

Published : Jul 15, 2022, 7:08 AM IST

Right to repair: మనం ఒక సెల్‌ఫోన్‌ కొంటాం. వారెంటీ ఉన్న సమయంలోనే, చిన్నపాటి మరమ్మతు ఏదైనా వస్తే, దూరంగా లేదా వేరే పట్టణం/నగరంలో ఉన్న అధీకృత సర్వీస్‌ సెంటరుకు వెళ్లలేక, వీధి చివర్లో ఉన్న మొబైల్‌ దుకాణంలో చూపించి, సరిచేయించుకుంటాం. తదుపరి ఆ సెల్‌ఫోన్‌లో ఏదైనా పెద్ద లోపం తలెత్తి, కంపెనీ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళితే, 'ఇంతకుముందు మా ధ్రువీకరణ లేని సంస్థలో మరమ్మతు చేయించారని, అందువల్ల వారెంటీ చెల్లదని' పేర్కొనడం అధికులకు ఎదరవుతున్న అనుభవమే.

ఏదైనా ద్విచక్ర వాహనం/కారు కొనుగోలు చేసినా, వాటికి సంబంధించి అసలైన విడిభాగాలు కావాలంటే, అదే కంపెనీ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి, వారు చెప్పిన ధర-సేవా రుసుము చెల్లించి, దానిని వాహనానికి అమర్చుకోవాల్సిందే. ఇవే కాదు రిఫ్రిజరేటర్‌, టీవీ, ఎయిర్‌ కండీషనర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల సర్వీస్‌లోనూ ఇదే పరిస్థితి. మనకు తెలిసిన మెకానిక్‌ను పిలిచి, సమస్య ఏంటో చూడమన్నప్పుడు వారు ఏదైనా మర (స్క్రూ) విప్పారా.. సీల్‌ పోయిందంటూ, తదుపరి ఉచిత సేవకు అధీకృత సేవా సంస్థలు నిరాకరిస్తున్నాయి. వారంటీ కూడా చెల్లదని తయారీ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా ఉత్పత్తుల మరమ్మతుతో పాటు విడిభాగాల విపణిపై కంపెనీలు ప్రదర్శిస్తున్న గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు కేంద్రప్రభుత్వం 'రైట్‌ టు రిపేర్‌'తో సిద్ధం కాబోతోంది.

వస్తువుల మరమ్మతునూ కావాల్సిన చోట చేయించుకునేలా రైట్‌ టు రిపేర్‌ విధివిధానాలను రూపొందించేందుకు వినియోగదారు వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ నెల 13న ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. రైట్‌ టు రిపేర్‌కు సంబంధించి కీలక రంగాలను గుర్తించింది. వ్యవసాయ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, మన్నికైన వినిమయ వస్తువులు, వాహన/వాహన విడిభాగాలను ఈ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది. నిబంధనావళి రూపొందించిన తర్వాత రైట్‌ టు రిపేర్‌ అమల్లోకి వస్తే, ప్రస్తుత విక్రయానంతర సేవా విధానమే సమూలంగా మారుతుందని భావిస్తున్నారు. థర్డ్‌ పార్టీ మరమ్మతులకు అనుమతిస్తే, ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ కమిటీలో అనుపమ్‌ మిశ్రా (సంయుక్త కార్యదర్శి, వినియోగదారు వ్యవహారాల విభాగం), జస్టిస్‌ పరమ్‌జిత్‌ సింగ్‌ ధలీవాల్‌ (పంజాబ్‌, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి), జీఎస్‌ బాజ్‌పాయ్‌ (వైస్‌ ఛాన్సలర్‌, రాజీవ్‌ గాంధీ నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా, పాటియాలా), ప్రొఫెసర్‌ అశోక్‌ పాటిల్‌ (చైర్‌ ఆఫ్‌ కన్జూమర్‌ లా అండ్‌ ప్రాక్టీస్‌) ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌, ఐరోపా దేశాల్లో రైట్‌ టు రిపేర్‌ ఇప్పటికే అమలవుతోంది. దేశీయంగా ఇది అమల్లోకి వస్తే వినియోగదార్లకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఆటంకాలివీ: తమ ఉత్పత్తులను ఎవరైనా సులభంగా మరమ్మతు చేసేందుకు వీలుగా మాన్యువల్‌ను కంపెనీలు ప్రచురించడం లేదు. స్క్రూలు, ఇతర విడిభాగాలను ఎలా తీయాలో తెలిపే డిజైన్‌ను వెల్లడించడం లేదు. దీంతో ఇతరుల వద్ద మరమ్మతు చేయించినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఆయా భాగాలు దెబ్బతింటున్నాయి. విడిభాగాలను తయారీ సంస్థలు బయట విక్రయించడం లేదు. కొన్ని సందర్భాల్లో విడిభాగం లేదంటూ, మరమ్మతును తీవ్ర ఆలస్యం చేస్తున్నారు. గుర్తింపు లేని సంస్థల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసినా కూడా వినియోగదారులు వారెంటీ హక్కును కోల్పోతున్నారు. వీటన్నింటినీ సరిదిద్దేలా నిబంధనలు రూపొందనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.