Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,300 పెరిగి ప్రస్తుతం రూ. 53,830 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.59,538 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,830 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,538వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,538 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,830 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,538 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,830 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,538 వేల వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,780 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.20 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్ విలువ రూ.62,027 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.20,50,192 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.20,50,192 |
ఇథీరియం | రూ.1,62,279 |
టెథర్ | రూ.84.66 |
బినాన్స్ కాయిన్ | రూ.27,103 |
యూఎస్డీ కాయిన్ | రూ.85.69 |
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్ల పైన ట్రేడ్ అవుతుండగా.. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 17,800 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 453 పాయింట్లు పెరిగి, 59,916 పాయింట్ల వద్ద ఉండగా.. నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి.. 17,836 వద్ద కదలాడుతోంది.
లాభనష్టాల్లోనివి: హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, మారుతి సుజుకీ, ఎస్బీఐ లైప్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. గ్రాసిమ్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి: ఎస్బీఐ రుణాలు ఇక మరింత భారం, మరోసారి వడ్డీ రేట్లు పెంపు
ఓలా కొత్త బైక్ లాంఛ్, సింగిల్ ఛార్జ్‌తో 131కిమీ జర్నీ, ధర ఎంతంటే