Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.220 స్వల్పంగా తగ్గి.. ప్రస్తుతం రూ.58,784 వద్ద ఉంది. కిలో వెండి ధర స్థిరంగా ఉండి.. ప్రస్తుతం రూ. 70,351 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 58,784 గా ఉంది. కిలో వెండి ధర రూ. 70,351 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ. 58,784 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 70,351 గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 58,784 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 70,351 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ. 58,784 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 70,351 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1921.90 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.83 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.18,58,220 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.18,58,220 |
ఇథీరియం | రూ.1,27,867 |
టెథర్ | రూ.81.54 |
బైనాన్స్ కాయిన్ | రూ.24,733 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.64 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 59,749 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 17,766 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐటీసీ, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసులు పెరిగి 81.52 వద్ద ట్రేడవుతోంది.