Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి.. 60,970కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ.2,690 తగ్గి.. రూ. 73,445 వద్ద నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- Gold price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,970 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,445గా ఉంది.
- Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.60,970గా ఉంది. కిలో వెండి ధర రూ.73,445 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vishakhapatnam : వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,970 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,445గా ఉంది.
- Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.60,970గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,445 వద్ద ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2,014 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.04 డాలర్ల వద్ద ఉంది.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,68,467 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,68,467 |
ఇథీరియం | రూ.1,45,395 |
టెథర్ | రూ.82.22 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,119 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.20 |
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 62,027 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ.. 18 పాయింట్లు లాభపడి 18,314 పాయింట్లకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.
శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నాయి.సెన్సెక్స్ ఐదు నెలల గరిష్ఠం వద్ద ముగిసింది. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు రాణించడం మార్కెట్లకు మద్దతుగా నిలిచింది.
జీవిత కాల గరిష్ఠానికి బంగారం ధర..
ఈ ఏడాది మే 4వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో పది గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠస్థాయికి చేరుకుంది. రూ.940 పెరిగి.. రూ.62,020కి చేరుకుంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.660 పెరిగి.. రూ.76,700కు పెరిగింది.