Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం గురువారంతో పోల్చితే సుమారుగా రూ.20 తగ్గి శుక్రవారం రూ.59,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.150 తగ్గి రూ.71,147గా ఉన్నది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,147గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147కు చేరింది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147కు చేరింది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1908 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.68 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.25,14,706 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.25,14,706 |
ఇథీరియం | రూ.1,52,747 |
టెథర్ | రూ.82.2 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,321 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.5 |
స్టాక్‌మార్కెట్ న్యూస్
Stock market today : శుక్రవారం దేశీయ మార్కెట్లు ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు పెరిగిన నేపథ్యమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 420 పాయింట్లు లాభపడి 64,336 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 113 పాయింట్లు వృద్ధి చెంది 19,085 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఏసియన్ పెయింట్స్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటాస్టీల్
రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే రూ.82.02 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది. జులై 1 నుంచి వీటి ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.