Gold Rate Today 20th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,239 ఉండగా.. బుధవారం రూ.61,242కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.74,195గా ఉండగా.. బుధవారం రూ.248 తగ్గి రూ.73,947కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 20th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,242గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,947గా ఉంది.
- Gold Price In Vijayawada 20th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 20th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947గా ఉంది.
- Gold Price In Proddatur 20th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1930 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1932 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.09 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 20th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,55,726 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,55,726 |
ఇథీరియం | రూ.1,36,213 |
టెథర్ | రూ.83.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,008 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.21 |
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market Today 20th September 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 732 పాయింట్లు నష్టపోయి 66,863 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 215 పాయింట్లు కోల్పోయి 19,917 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటాస్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, టైటాన్, ఐటీసీ
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఆసియా మార్కెట్లు అన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి రూ.83.26 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 20th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.99 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 93.41 డాలర్లుగా ఉంది.