Gold Rate Today 19th October 2023 : దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. అలాగే వెండి ధర భారీగా తగ్గింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,394 ఉండగా.. గురువారం రూ.233 తగ్గి రూ.రూ.61,161కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,629 ఉండగా.. గురువారం రూ.574 తగ్గి రూ.73,055కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 19th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,161గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,055గా ఉంది.
- Gold Price In Vijayawada 19th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,161గా ఉంది. కిలో వెండి ధర రూ.73,055కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 19th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,161గా ఉంది. కిలో వెండి ధర రూ.73,055గా ఉంది.
- Gold Price In Proddatur 19th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,161గా ఉంది. కిలో వెండి ధర రూ.73,055కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 19th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1938 డాలర్లుగా ఉండగా.. గురువారం 9 డాలర్లు పెరిగి 1947 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.82 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 19th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,50,219 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,50,219 |
ఇథీరియం | రూ.1,28,974 |
టెథర్ | రూ.83.26 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,388 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.26 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 19th October 2023 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్నీ ప్రధాన కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 65,437.33 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 131 పాయింట్లు కోల్పోయి 19,540 వద్ద ట్రేడ్ అవుతోంది.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్..
ఐటీసీ, ఇన్ఫీ, మారుతీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, రిలయన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టల్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టాటామోటార్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, విప్రో.
లాభాల్లో కొనసాగుతున్న షేర్స్..
ఇండస్ఇండ్, హెచ్‌సీఎల్ టెక్
రూపాయి విలువ!
Rupee Open 19th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 19th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
7th Pay Commission DA Hike : ఉద్యోగులకు డీఏ పెంపుతో.. వేతనం ఎంత పెరుగుతోంది..?
DA Hike News : ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ 4 శాతం పెంపు.. రైల్వే ఎంప్లాయిస్‌కు 78 రోజుల బోనస్