Gold Rate Today 18th August 2023 : మొదటి శ్రావణ శుక్రవారం వేళ బంగారం ప్రియులకు శుభవార్త. దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,020గా ఉండగా.. శుక్రవారం కూడా అదే ధర పలుకుతోంది. మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.60,019గా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగానే పెరిగాయి. గురువారం కిలో వెండి ధర రూ.71,520గా ఉండగా.. శుక్రవారం రూ.1,085 పెరిగి రూ.72,605కు చేరింది.
- Gold Price In Hyderabad 18th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,019గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,605గా ఉంది.
- Gold Price In Vijayawada 18th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,605కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 18th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,605గా ఉంది.
- Gold Price In Proddatur 18th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,605కు చేరుకుంది.
గమనిక :
పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 18th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1893 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 1894 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.85 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 18th August 2023 : యూఎస్డీ కాయిన్ మినహా మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పూర్తి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,93,354 వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,93,354 |
ఇథీరియం | రూ.1,39,317 |
టెథర్ | రూ.83.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,894 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.8 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 18th August 2023 : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 310 పాయింట్లు నష్టపోయి 64,841 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 97 పాయింట్లు కోల్పోయి 19,268 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, ఎన్టీపీసీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యంక్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, రిలయన్స్, విప్రో, టీసీఎస్, ఇన్ఫీ స్టాక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 18th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు ఎగబాకి రూ.83.02 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 18th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రూడ్ ఆయిల్ రేట్..!
Crude Oil Rates Today 18th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 84.23 డాలర్లుగా ఉంది.
330 RS Deducted From SBI Account : బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.330 కట్ అయ్యాయా? కారణమిదే..
How to Get PPO Number in Online : ప్రైవేట్ ఉద్యోగులారా.. పీపీఓ నంబర్ తెలుసుకున్నారా..?