Gold Rate Today 12th October 2023 : దేశంలో పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.59,350 ఉండగా.. గురువారం రూ.622 పెరిగి రూ.59,972కు చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ.70,845 ఉండగా.. గురువారం రూ.652 పెరిగి రూ.71,497కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 12th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,972గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,497గా ఉంది.
- Gold Price In Vijayawada 12th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 12th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497గా ఉంది.
- Gold Price In Proddatur 12th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,972గా ఉంది. కిలో వెండి ధర రూ.71,497కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ భారీగా పెరగ్గా.. సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1861 డాలర్లుగా ఉండగా.. గురువారం 17 డాలర్లు పెరిగి 1878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.12 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ. 22,29,553 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,29,553 |
ఇథీరియం | రూ.1,29,734 |
టెథర్ | రూ.83.8 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,095 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.13 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 66,364 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 31 పాయింట్ల నష్టంతో 19,780 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్స్..
మారుతీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, రిలయన్స్.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్..
ఐటీసీ, ఏషియెన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, విప్రో, టైటాన్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, భారతీఎయిర్‌టెల్, ఇన్ఫీ, నెస్లే, టీసీఎస్, టెక్ మహీంద్రా.
రూపాయి విలువ!
Rupee Open 12th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు ఎగబాకి రూ.83.14 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 12th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధరలు!
Crude Oil Today 12th October 2023 : బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 0.45 శాతం తగ్గి 85.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.