Gold Purity Check : భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ. ఇంట్లోని ప్రతి శుభకార్యానికీ పసిడి ఆభరణాలు ధరించాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఇప్పుడు శ్రావణమాసం కూడా వచ్చేసింది. దీనితో బంగారానికి అమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. బంగారం కొనడం వరకు ఓకే.. మరి దాని స్వచ్ఛతను గుర్తించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం స్వచ్ఛత ప్రమాణాలు!
Gold Purity Standards In India : బంగారం కొనేముందు దాని స్వచ్ఛత గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును.. పసిడి ఆభరణాలు కొనేందుకు ఉపయోగిస్తాం. వీటిని మనం జీవితాంతం ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే బంగారం స్వచ్ఛత తెలుసుకొనే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు.
బీఐఎస్ హాల్‌మార్క్
Bis Hallmark Check : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ) చట్టం ప్రకారం, బంగారు ఆభరణాలపై కచ్చితంగా హాల్‌మార్కింగ్ ఉండాలి. అయితే ఈ హాల్‌మార్కింగ్‌లో 5 భాగాలు ఉంటాయి. వాటి గురించి కూడా మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
1. హాల్‌మార్క్ గుర్తు :
Hallmark Logo : మనలో చాలా మందికి బంగారంపై హాల్‌మార్క్ ఉంటుందని తెలుసు. కానీ ఆ హాల్‌మార్క్ గుర్తు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే హాల్‌మార్క్ గుర్తు గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
2. బంగారంలో రకాలు
Gold Carat Table :
- 999 - 24 క్యారెట్స్ (ఇది పూర్తిగా స్వచ్ఛమైన బంగారం. అయితే ఈ స్వచ్ఛమైన పసిడితో ఆభరణాలు చేయలేము.)
- 958 - 23 క్యారెట్స్
- 916 - 22 క్యారెట్స్
- 875 - 21 క్యారెట్స్
- 750 - 18 క్యారెట్స్
- 708 - 17 క్యారెట్స్
- 585 - 14 క్యారెట్స్
- 417 - 10 క్యారెట్స్
- 375 - 9 క్యారెట్స్
- 333 - 8 క్యారెట్స్
3. హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ : ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోను తనిఖీ చేయాలి. హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితాను https://bis.gov.in/cert/list_of_hc.asp/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
4. మార్కింగ్ సంవత్సరం : ఆభరణాలను తయారుచేసిన సంవత్సరాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రూపంలో తెలియజేస్తారు. ఉదాహరణకు ‘A’ అక్షరం 2000 సంవత్సరాన్ని సూచిస్తుంది. అలాగే ‘J’ -2008, ‘N-2010, ‘M’- 2011 మొదలైనవి.
5. జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ :
Jeweler Identification Mark : బంగారం వ్యాపారస్తులు బీఐఎస్ సర్టిఫైడ్ ఐడెంటిఫికేషన్ మార్క్‌ను కలిగి ఉండాలి. అందుకే బంగారం కొనేముందు కచ్చితంగా ఆ షాప్ గుర్తింపు మార్క్‌ను కూడా చూసుకోవాలి.
Basic Signs Of Hallmarking : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, హాల్మార్క్డ్ ఆభరణాల్లో 3 గుర్తులు కచ్చితంగా ఉండాలి. అవి :
- 1. BIS లోగో
- 2. Purity/ Fineness Grade
- 3. ఆరు అంకెల ఆల్ఫాన్యూమెరిక్ కోడ్ ( HUID)
నోట్: బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా.. బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే.. హాల్‌మార్క్ గుర్తు పసిడి స్వచ్ఛతకు భరోసా ఇస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేసి తరువాత కచ్చితంగా క్యాష్ మెమోను అడిగి తీసుకోవాలి. ఒకవేళ మీకు భవిష్యత్‌లో ఏదైనా సమస్య వచ్చి, ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఈ క్యాష్ మెమో మీకు సహాయపడుతుంది.
KDM Gold Purity : చాలా మంది KDM ఆభరణాలు కొంటూ ఉంటారు. కానీ కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధరణ చేయదు. అందుకే హాల్‌మార్కింగ్ ఉన్న గోల్డ్ కొనడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ప్రస్తుతం హాల్‌మార్కింగ్ ధర కేవలం రూ.35+ జీఎస్టీ మాత్రమే. వాస్తవానికి మీరు ఎంత ఎక్కువ పరిమాణంలో బంగారం కొన్నప్పటికీ.. ఈ హాల్‌మార్కింగ్ ఛార్జ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. గోల్డ్ స్వచ్ఛత విషయంలో మరింత సమాచారం కావాలంటే.. బీఐఎస్ వెబ్ సైట్ www.bis.org.in ను సందర్శించండి.
పాత బంగారం సంగతి ఏమిటి?
Old Gold Ornaments Purity Test : మన ఇంట్లో తరతరాలుగా వస్తున్న పాత బంగారం ఉంటుంది. మరి అలాంటి బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఆనేక ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫైర్ అండ్ ఫ్లోరోసెన్స్ టెస్ట్
- ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ టెస్ట్
- యాసిడ్ టెస్ట్
- డెన్సిటీ టెస్ట్
- ప్లాస్మా మాస్ స్పెక్ట్రోమెట్సీ
పైన పేర్కొన్న టెస్ట్‌లు మనం ఇంట్లో చేసుకునేవి కాదు. కానీ బంగారం పనిచేసే వాళ్లు ఈ టెస్టులు చేస్తారు. అందుకే మీకు నమ్మకమైన కంసాలుల వద్ద లేదా నిపుణుల వద్ద ఆయా టెస్ట్‌లు చేయించుకుని.. మీ దగ్గర ఉన్న బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.
గోల్డ్ టెస్ట్ కిట్ :
Gold Test Kit : ప్రస్తుతం మార్కెట్లోకి అనేక గోల్డ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి, ఇంట్లోనే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఈ గోల్డ్ టెస్ట్ కిట్‌లో ఒక ప్రత్యేకమైన రాయి, టెస్టింగ్ సొల్యూషన్, ఛార్ట్ ఉంటాయి. మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఈ రాయిపై కాస్త రుద్దిన తరువాత, దానిపై టెస్టింగ్ సొల్యూషన్ వేయాలి. దీనితో బంగారం రంగులో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. వాస్తవానికి బంగారం స్వచ్ఛతను అనుసరించి, బంగారం రంగుల్లో మార్పులు ఉంటాయి. ఛార్ట్‌లో ఈ రంగులు - స్వచ్ఛత జాబితా ఉంటుంది. దీని ఆధారంగా మీ దగ్గర ఉన్న బంగారం స్వచ్ఛత తెలుసుకోవచ్చు.