Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. గురువారం 52,540 వద్ద ఉన్న బంగారం ధర.. రూ. 200 పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,740కి చేరింది. కిలో వెండి ధర రూ.650 పెరిగి.. ప్రస్తుతం రూ.63,803 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,740గా ఉంది. కిలో వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,803గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 1,853 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.09 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Stock Market Updates: గురువారం సెషన్లో లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. శుక్రవారం సెషన్లో కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 225 పాయింట్లు పెరిగి.. 54 వేల 478 వద్ద సెషన్‌ను కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో.. 16 వేల 237కు చేరింది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా ఇతర అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే రూ.46,576 పతనమైంది. ప్రస్తుతం రూ. 22,29,641 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,29,641 |
ఇథీరియం | రూ.1,33,691 |
టెథర్ | రూ.82.94 |
బినాన్స్ కాయిన్ | రూ.23,028 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.78 |
ఇదీ చూడండి : ట్విట్టర్‌తో 'డోర్సే' కటీఫ్.. మస్క్‌కు తేల్చిచెప్పిన మాజీ సీఈఓ!