Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బుధవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.510 మేర పెరిగింది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.370 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,520గా ఉంది. కిలో వెండి ధర రూ.59,200 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,520 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,200గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,200 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,200 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,772 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.01 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్ విలువ స్వల్పంగా పతనమైంది. ఒక్కో బిట్‌కాయిన్ విలువ రూ.8,780 మేర క్షీణించింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,06,219 పలుకుతోంది. ఇథీరియం రూ.2వేలకు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.1,37,865 వద్ద కొనసాగుతోంది.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,06,219 |
ఇథీరియం | రూ.1,37,865 |
టెథర్ | రూ.83.60 |
బినాన్స్ కాయిన్ | రూ.25,589 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.70 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల అండతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 310పాయింట్ల లాభంతో 58,661వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 17,473వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్‌టీపీసీ, మారుతీ, ఎస్‌బీఐ, రిలయన్స్, పవర్‌గ్రిడ్ హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ పైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
రూపాయి: గురువారం రూపాయి విలువ పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 24 పైసలు పతనమై.. 79.39 వద్ద ట్రేడవుతోంది.
ఇదీ చదవండి: