Gold price today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.290 మేర దిగొచ్చింది. మరోవైపు వెండి ధర భారీగా వృద్ధి చెందింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1100పెరిగి రూ.62,740 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,970 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,970గా ఉంది. కిలో వెండి ధర రూ.62,970 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,970 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,970గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,970గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,970 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,970గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,970వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,816 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.67 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.50, లీటర్ డీజిల్ రూ.104.75. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్‌కాయిన్, ఇథీరియం, బినాన్స్ కాయిన్ సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
- బిట్‌కాయిన్ 2.57 శాతం తగ్గి.. 24,43,957 వద్ద ఉంది.
- ఇథీరియం 3 శాతానికిపైగా తగ్గుముఖం పట్టి.. 1,66,132 వద్ద ట్రేడవుతోంది.
- టెథర్ 82.23, యూఎస్డీ కాయిన్ 82.31 వద్ద ఉంది.
- బినాన్స్ కాయిన్ విలువ 2 శాతానికిపైగా పతనమై.. 24 వేల 682 వద్ద ఉంది.
Stock Market Closing: క్రితం సెషన్లో భారీ లాభాలు నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. బుధవారం నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 400 పాయింట్లకుపైగా పెరిగింది. చివరకు అమ్మకాల ఒత్తిడితో 110 పాయింట్లు కోల్పోయి.. 54 వేల 209 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 16 వేల 240 వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ రాణించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి. రియాల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలకు మొగ్గుచూపారు మదుపరులు.
ఇవీ చూడండి: 'ట్విట్టర్‌తో డీల్ కష్టమే.. అలా చేస్తేనే ముందుకు..!'