ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. స్టాక్​ మార్కెట్లలో మళ్లీ జోష్​ - స్టాక్​ మార్కెట్లు లైవ్​

Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.52వేల 520 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63 వేలకు చేరింది. మరోవైపు స్టాక్​ మార్కెట్లు 3 వరుస సెషన్ల నష్టాల అనంతరం పుంజుకున్నాయి.

Gold Price Today-Crypto Currency Stock Market News

author img

By

Published : May 26, 2022, 3:39 PM IST

Gold Price Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం 52,940 వద్ద ఉండగా.. గురువారం రూ. 400 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,540కి చేరింది. కిలో వెండి ధర 550 తగ్గి.. ప్రస్తుతం రూ.63,150 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,540గా ఉంది. కిలో వెండి ధర రూ.63,150వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,540 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,150గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,540గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,150 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,540గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,150 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,846 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.81 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Stock Market Updates: 3 వరుస సెషన్ల నష్టాల అనంతరం.. స్టాక్​ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 503 పాయింట్లు పెరిగి.. 54 వేల 253 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో.. 16 వేల 170 వద్ద స్థిరపడింది. ఐటీ, లోహం, బ్యాంకింగ్​ రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు వ్యాపార వర్గాలు విశ్లేషించాయి. ఆయిల్​ అండ్​ గ్యాస్​, విద్యుత్​ రంగ సూచీలు నష్టపోయాయి. టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, అపోలో హాస్పిటల్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రాణించాయి. ఐటీసీ, యూపీఎల్​, దివీస్​ ల్యాబ్స్, సన్​ ఫార్మా, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేర్లు పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలు నమోదుచేశాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే పతనమైంది. ప్రస్తుతం రూ. 24,00,028 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,00,028
ఇథీరియంరూ.1,51,317
టెథర్రూ.82.62
బినాన్స్​ కాయిన్రూ.25,749
యూఎస్​డీ కాయిన్రూ.82.78

ఇదీ చదవండి: గోల్డ్​లోన్​ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.