FD Rates For Senior Citizens : ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే సీనియర్ సిటిజన్స్‌కు బంపర్ బొనాంజా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న, కొత్త ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల పైబడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.1 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. వాస్తవానికి పెద్దవారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడితే.. వడ్డీ రూపంలో మంచి ఆదాయం చేతికి అందుతుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో సులభంగా ఈ పొదుపు ఖాతాలోని సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి కూడా వీలవుతుంది. వాస్తవానికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వలన అత్యవసర నిధి ఏర్పరుచుకునేందుకు కూడా వీలు కలుగుతుంది.
పన్ను నామమాత్రమే!
Fixed Deposit Tax : వాస్తవానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సీనియర్ సిటిజన్లపై చాలా తక్కువ పన్ను శ్లాబ్ ఉంటుంది. కనుక ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను భారం నామమాత్రమే అని చెప్పవచ్చు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు!
Small Finance Bank Fixed Deposit Interest Rates 2023 : ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సహా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కంటే ఎక్కువ కాలానికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : ఈ బ్యాంక్ 3 ఏళ్ల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్స్‌కు 9.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఒక వేళ మీరు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే.. మూడేళ్లలో అది 1.31 లక్షలు అవుతుంది.
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : మూడేళ్ల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్స్‌కు 8.60 శాతం వడ్డీని అందిస్తోంది ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. దీనిలో కనుక మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీ చేతికి రూ.1.29 లక్షలు అందుతాయి.
- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : ఇది కూడా సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.60 శాతం మేర వడ్డీని అందిస్తోంది.
చిన్న బ్యాంకుల - వడ్డీ రేట్లు!
Small Bank Fixed Deposit Interest Rates 2023 : సీనియర్ సిటిజన్స్ మూడేళ్ల వ్యవధితో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకు 8.50 శాతం వడ్డీ; ఇండస్ఇండ్ బ్యాంక్ 8 శాతం వడ్డీ; ఎస్బీఎం బ్యాంక్ 7.8 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
పెద్ద బ్యాంకుల - వడ్డీ రేట్లు
Private Banks Fixed Deposit Interest Rates 2023 : సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా 7.55 శాతం; పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.5 శాతం; కెనరా బ్యాంక్ 7.3 శాతం చొప్పున వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
రూ.5 లక్షల వరకు గ్యారెంటీ!
DICGC Guarantee For Fixed Deposit : చిన్న చిన్న ప్రైవేట్ బ్యాంకులు.. సీనియర్ సిటిజన్స్ చేసే కొత్త డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ పెట్టుబడుల గురించి మీకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఎందుకంటే ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్.. ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై రూ.5 లక్షల వరకు గ్యారెంటీ ఇస్తుంది.