ETV Bharat / business

ఉద్యోగులకు EPF శుభవార్త! అందుబాటులోకి అధిక పింఛను ఆన్‌లైన్‌ దరఖాస్తు.. అప్లై చేసుకోండిలా.. - eps 95 pension latest news today

ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఈపీఎఫ్​ పరిధిలోకి వచ్చే అర్హులైన పింఛనుదారులకు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్​ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉమ్మడి ఆప్షన్ లింక్​ను ఈపీఎఫ్​ఓ ప్రకటించింది.

online application for higher pension
అందుబాటులోకి వచ్చిన అధిక పింఛను ఆన్‌లైన్‌ దరఖాస్తు
author img

By

Published : Feb 27, 2023, 10:11 AM IST

Updated : Feb 27, 2023, 10:36 AM IST

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు.. అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఆ సంస్థ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్​లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఉమ్మడి ఆప్షన్ లింక్​ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్​ఓ) ఆదివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు 2022 నవంబరు 4న సుప్రీంకోర్టు.. EPS కింద అధిక పింఛను దరఖాస్తు చేసుకునేందుకు నాలుగు నెలల సమయం ఇస్తూ తీర్పు ఇచ్చింది.

ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్‌ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ.. ఈపీఎస్‌ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారు అర్హులని పేర్కొంది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు గడువు మే 3గా విధించింది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఆన్​లైన్​లో అప్లై చేసుకునే విధానం..
ఈపీఎఫ్​వో వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్‌ మెంటర్‌ పోర్టల్‌ హోంపేజీలో ప్రత్యేక లింకును ఆదివారం అర్ధరాత్రి ఏర్పాటు చేసింది ఆ సంస్థ. దీనికి దరఖాస్తును చేసుకునే వారు హోంపేజిలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్​ లింకును క్లిక్ చేయాలి. అనంతరం ఈపీఎస్‌ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తును క్లిక్‌ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు (యూఏఎన్‌) ఖాతాద్వారా పూర్తి చేయాలి. ఈపీఎఫ్‌వో రికార్డుల ప్రకారం చందాదారు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఆధార్​తో లింక్ చేసిన మొబైల్ నంబరును వినియోగించాలి. చందాదారు వివరాలన్నీ ఇలా మొత్తం 4 దశల్లో పూర్తి చేశాక దరఖాస్తు నంబరు వస్తుంది.

Last Updated : Feb 27, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.