ETV Bharat / business

'చైనీయులు సూపర్‌ టాలెంటెడ్‌.. కానీ అమెరికన్లు మాత్రం' - ఎలాన్​ మస్క్​ వార్తలు

టెస్లా చీఫ్​ ఎలాన్​ మస్క్​ చైనా కార్మికులపై ప్రశంసలు కురిపించారు. చైనా శ్రామికులు కష్టపడి పనిచేస్తున్నారని.. అదే అమెరికన్లు అయితే పనిని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. శ్రామిక శక్తి కారణంగా చైనా.. చాలా బలమైన కంపెనీలను స్థాపిస్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు.

musk
musk
author img

By

Published : May 12, 2022, 10:46 PM IST

పని విషయంలో అమెరికా, చైనా కార్మికులను పోల్చుతూ ప్రముఖ బిలియనీర్‌, టెస్లా చీఫ్ ఎలాన్‌ మస్క్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చైనా శ్రామికులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 'ఉత్పత్తి రంగాన్ని నమ్ముకునే చైనాలో చాలా మంది సూపర్ టాలెంటెడ్, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారు. వారు కేవలం అర్ధరాత్రి వరకే కాదు.. తెల్లవారుజామున 3 గంటల వరకు పని చేస్తారు' అని అన్నారు. అమెరికన్ల వైఖరిపై స్పందిస్తూ.. వారు పనికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రామిక శక్తి కారణంగా చైనా.. చాలా బలమైన కంపెనీలను స్థాపిస్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు.

చైనా షాంఘైలోని టెస్లా గిగాఫ్యాక్టరీలో మూడు వారాల షట్‌డౌన్‌ అనంతరం.. గత నెలలో తిరిగి ఉత్పత్తి ప్రక్రియ మొదలు కాగా.. ఫ్యాక్టరీ కార్మికులు అందులోనే నిద్రపోయారు. ఈ క్రమంలోనే చైనీయులను మెచ్చుకుంటూ మస్క్‌ మాట్లాడారు. టెస్లా మోడల్ 3 సెడాన్ వాహనాల ఉత్పత్తి పెంపుదల సమయంలో తాను కాలిఫోర్నియాలోని ఫ్యాక్టరీలో నేలపై పడుకున్నానని మస్క్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ‘నేను టెస్లా సిబ్బందికి చాలా రుణపడి ఉన్నట్లు భావిస్తున్నా. ఆ సమయంలో హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోలేనని కాదు. కానీ.. కంపెనీలో నా పరిస్థితి అందరికంటే కఠినంగా ఉండాలని భావించిన నేపథ్యంలో.. నేలపై పడుకున్నా. కార్మికులకంటే.. నేను అనుభవించే నొప్పి ఎక్కువగా ఉండాలని కోరుకున్నా’నని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 1158 పాయింట్లు డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.