Education Loan Interest Rate In India : దేశంలో ఉన్నత విద్యనభ్యసించే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో విద్యకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరిగింది. అందువల్ల మంచి పేరున్న కళాశాల, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విద్యార్థులు కొత్త కొత్త కోర్సులను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే.. విద్యాసంస్థలు కూడా వినూత్న కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఈ కొత్త కోర్సుల విద్యాభ్యాసానికి.. విద్యార్థుల నుంచి భారీగానే ఫీజులు చేస్తున్నాయి విద్యాసంస్థలు. ప్రతి సంవత్సరం విద్యా ద్రవ్యోల్బణం 10-12 శాతం పైనే పెరుగుతూ వస్తోంది.
ఈ ఫీజుల మొత్తాన్ని కవర్ చేయాలంటే.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్నీ వెచ్చించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అవి కూడా సరిపోని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఈ ఖర్చులను భరించేందుకు.. విద్యార్థులు విద్యా రుణాన్ని ఎంచుకోవడం ఉత్తమం. విద్యా రుణం మంజూరు చేసే సమయంలో కళాశాల, కోర్సు వివరాలు, విద్యకు అయ్యే మొత్తం ఖర్చులు, అకడమిక్ రికార్డ్స్, కుటుంబ ఆదాయం, ఆస్తులు మొదలైన వివరాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. విద్యారుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకులు, అవి విధించే వడ్డీ వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.
విద్యా రుణం పొందడం ఎలా?
How To Get Education Loan : దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్నవారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వదేశం, విదేశం.. ఎక్కడైనా సరే.. ఉన్నత విద్య ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. అయితే, విద్యారుణాలు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంటాయి. విద్యారుణాలు ఎలా పొందాలో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యా రుణం సులభంగా చెల్లించండిలా..!
How To Repay Education Loan : సామాన్యులు కూడా దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహాయపడుతున్నాయి విద్యారుణాలు. ఇతర రంగాలతో పోలిస్తే విద్యా రంగంలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారత దేశంలో ఈ రేటు 11 నుంచి 12 శాతం ఉంది. దీని కారణంగా రుణం లేకుండా ఉన్నత విద్య సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చదువు పూర్తయినా ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. మరి అన్ని పరిస్థితులను అధిగమించి విద్యారుణాన్ని సులభంగా తీర్చాలంటే నిబద్ధత అవసరం. కొన్ని మార్గాలను అనుసరిస్తే.. ఇది సాధ్యం అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి