ETV Bharat / business

'హీరో' ఛైర్​పర్సన్ ఇంటిపై ఈడీ దాడులు.. రూ.25 కోట్ల ఆస్తులు సీజ్.. డైమండ్ ఆభరణాలు సైతం.. - హీరో మోటర్స్ ఛైర్మన్ ఇంటిపై ఈడీ దాడులు

హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్ పవన్ కాంత్ ముంజాల్ ఇంటిపై చేసిన దాడుల్లో రూ.25 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. భారత్​తో పాటు విదేశీ కరెన్సీ సోదాల్లో లభ్యమైనట్లు వెల్లడించింది.

ED raids hero motocorp chairman
హీరో మోటర్స్ ముంజల్​పై ఈడీ దాడులు
author img

By

Published : Aug 2, 2023, 10:55 PM IST

ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్ పవన్ కాంత్ ముంజాల్ ఇంటిపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మంగళవారం ఆయన ఇంట్లో నిర్వహించిన ఈ సోదాల్లో భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. బంగారు, డైమండ్ ఆభరణాలను సీజ్ చేసినట్లు తెలిపింది. వీటన్నింటి విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది.

పవన్ కాంత్ ముంజాల్ (69) ఇల్లు, కార్యాలయాలతో పాటు హీరో మోటోకార్ప్​ లిమిటెడ్​, హీరో ఫిన్​కార్ప్ లిమిటెడ్​కు చెందిన హేమంత్ దహియా, కేఆర్ రామన్​ ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది. దిల్లీ, గురుగ్రామ్​లలో ఈ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. అయితే, ఏ ఇంటి నుంచి ఎంత మొత్తంలో ఆస్తులు సీజ్ చేశారన్న విషయంపై ఈడీ స్పష్టతనివ్వలేదు. హీరో కంపెనీ సైతం దీనిపై వివరణ ఇవ్వలేదు. మంగళవారం సోదాలు జరుగుతున్న సమయంలో మాత్రం.. ఈడీ అధికారులకు సహకరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది హీరో మోటోకార్ప్. విదేశీ, భారత కరెన్సీతో పాటు నేర నిరూపణకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తాజాగా వెల్లడించింది. హార్డ్ డిస్క్​లు, మొబైల్స్​ను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.

కేసు ఇదీ..
మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని నిబంధనల కింద ముంజాల్‌పై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తును ఈడీ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ)కు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ముంజాల్​పై ఈ ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.

2018లో ముంజాల్ లండన్ పర్యటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. వ్యాపార పర్యటన నిమిత్తం 2018లో లండన్​కు వెళ్లిన పవన్ ముంజాల్.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకునేందుకు థర్డ్ పార్టీ సేవల సంస్థకు చెందిన ఓ అధికారిని హీరో మోటోకార్ప్ ద్వారా నియమించుకున్నారు. పర్యటన నిమిత్తం ముంజాల్​తో పాటు థర్డ్ పార్టీ సేవల సంస్థ అధికారి లండన్​కు వెళ్లేందుకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే, ముంజాల్​తో పాటు ఉన్న ఆ వ్యక్తి లగేజీ బ్యాగ్​ను విమానాశ్రయ సిబ్బంది తనిఖీ చేశారు. ఆ బ్యాగ్​లో రూ.81 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ బయటపడింది. దీంతో ఈ కరెన్సీని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. విదేశీ మారకపు నిర్వహణ చట్టం కింద దీనిపై కేసు నమోదు చేశారు. దీని ఆధారంగానే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.