ETV Bharat / business

ఉమ్మడిగా హోమ్​లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్​తో తక్కువ వడ్డీ, అధిక రుణం! - గృహరుణం వడ్డీ రేట్లు

గృహరుణ వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రుణగ్రహీతలకు అర్హత మొత్తం తగ్గిపోతోంది. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారు, ఆదాయం అంతగా లేని వారు.. ఇలాంటి సమయంలో ఉమ్మడి గృహరుణం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. సాధారణంగా బ్యాంకులు దంపతులను సహ దరఖాస్తుదారులుగా అంగీకరిస్తాయి. ఆదాయం ఉన్న దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు, ఆస్తిలో సహ యాజమాన్యాన్ని కలిగిన వారితో కలిసి ఉమ్మడిగా గృహరుణం తీసుకునేందుకు వీలుంటుంది. ఇలా ఉమ్మడి రుణాలు తీసుకోవాలనుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటో ఓ సారి తెలుసుకుందాం..

home loans
గృహరుణం
author img

By

Published : Jul 4, 2022, 12:21 PM IST

గృహరుణం వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణగ్రహీతలకు అర్హత మొత్తం తగ్గిపోతోంది. దీనివల్ల ఆశించిన అప్పు దొరకక చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారు, ఆదాయం అంతగా లేని వారు.. ఇలాంటి సమయంలో ఉమ్మడి గృహరుణం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. సాధారణంగా బ్యాంకులు దంపతులను సహ దరఖాస్తుదారులుగా అంగీకరిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇతరులూ కలిసి రుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశమూ ఉంది. ఇలా ఉమ్మడి రుణాలు తీసుకోవాలనుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటో చూద్దాం..

ఆదాయం ఉన్న దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు, ఆస్తిలో సహ యాజమాన్యాన్ని కలిగిన వారితో కలిసి ఉమ్మడిగా గృహరుణం తీసుకునేందుకు వీలుంటుంది. ఉదాహరణకు జీవిత భాగస్వామి, కొడుకు, తండ్రి, సోదరులు సహ దరఖాస్తుదారులుగా ఉండొచ్చు. తండ్రి లేదా తల్లితో కలిసి పెళ్లికాని కుమార్తెలు సహ దరఖాస్తుదారులుగా రుణాలను తీసుకునేందుకు వీలుంది. సోదరీమణులు, స్నేహితులు, దూరపు బంధువులను సాధారణంగా గృహరుణ సహ దరఖాస్తుదారులుగా అంగీకరించరు.

మీ సహ రుణగ్రహీతను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. గృహరుణం ఒక దీర్ఘకాలిక ఒప్పందం. ఈ ప్రయాణం పూర్తయ్యే వరకూ తోడుండే వారినే సహ దరఖాస్తుదారుగా ఎంచుకోవడం ఉత్తమం. వివాదాలకు దారితీసే అవకాశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి రుణం తీసుకుంటే.. అనుకోకుండా.. విడాకులు తీసుకుంటే.. ఈఎంఐలకు బాధ్యులు ఎవరు? అనేది ముందే స్పష్టమైన అవగాహన ఉండాలి. అదే విధంగా తల్లిందండ్రులు, సోదరులతోనూ వివాదాలు ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ముందే అప్రమత్తంగా ఉండాలి.

అర్హత పెరిగేలా..: సహ రుణగ్రహీతతో కలిసినప్పుడు మీ రుణ అర్హత పెరుగుతుంది. అయితే, ఆ వ్యక్తి క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోతే.. రుణ మొత్తం, వడ్డీ రేటుపై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. కాబట్టి, మంచి క్రెడిట్‌ స్కోరున్న వ్యక్తితో కలిసి రుణం తీసుకోవడం మంచిది.
రుణం తీరేలా..: రుణం ఏదైనా సరే.. దానికి లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవడం అవసరం. గృహరుణానికి ఇది తప్పనిసరి. ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు.. రుణగ్రహీతలు ఇద్దరిలో ఎవరికైనా అనుకోనిది జరిగితే.. ఒకరిపైనే మొత్తం రుణ భారం పడుతుంది. దీన్ని నివారించేందుకు.. లోన్‌ కవర్‌ టర్మ్‌ బీమా తోడ్పడుతుంది. ఒకరు మరణిస్తే.. మొత్తం రుణం బీమా పాలసీ చెల్లించేలా చూసుకోవాలి.

పన్ను మినహాయింపు..: మీరు సహ రుణగ్రహీత, ఆస్తి ఉమ్మడి యజమాని అయినప్పుడు గృహరుణంపై వర్తించే వివిధ పన్ను ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. ఆస్తికి ఉమ్మడి యజమానిగా ఉన్నవారు చెల్లించిన వాయిదాలను ఆదాయపు పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. సెక్షన్‌ 80సీలో గృహరుణం అసలు రూ.1,50,000 పరిమితికి లోబడి క్లెయిం చేసుకోవచ్చు. ఉదాహరణకు రుణగ్రహీతలిద్దరికీ ఆస్తిలో 50 శాతం వాటా చొప్పున ఉందనుకుందాం. చెల్లించిన వడ్డీ రూ.4లక్షలు ఉంది. ఇప్పుడు సెక్షన్‌ 24 ప్రకారం చెరో రూ.2లక్షల చొప్పున పన్ను మినహాయింపు పొందవచ్చు. అసలు.. సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు ఇద్దరూ సమానంగా మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు.

ఇవీ చదవండి: పెట్రోల్​పై సుంకం తగ్గించినా.. ఖజానాకు నష్టం తక్కువే!.. కొత్త పన్నుతో భర్తీ!

మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్​ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.