ETV Bharat / business

ఆరోగ్య బీమా ఆగిపోకుండా ఉండాలంటే? - ఆరోగ్య బీమా రీఫిల్​

పూర్తిస్థాయి ఆరోగ్య బీమా అవసరం ఏమిటో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనారోగ్యంలో ఆర్థికంగా భారం కాకుండా.. ఈ పాలసీ తోడుంటుంది. మారుతున్న వైద్య అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు వస్తున్న వైద్య పాలసీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి  ప్రత్యేకతల్లో.. రీస్టోరేషన్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

health insurance restoration
health insurance restoration
author img

By

Published : Jun 12, 2022, 3:32 PM IST

health insurance restoration: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, పాలసీ విలువ మేరకు క్లెయిం చేసుకున్నారు.. మరోసారి ఆసుపత్రికి వెళ్తే.. బీమా రక్షణ ఉండదు కాబట్టి, చేతి నుంచి డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఇలాంటి ఇబ్బంది లేకుండా.. విలువ పూర్తయిన వెంటనే.. పాలసీ పూర్వ స్థితికి చేరుకుంటే.. ఇదే రీస్టోరేషన్‌ లేదా రీఫిల్‌.. పాలసీ మొత్తం ఖర్చయినా.. తిరిగి అదే విలువకు చేరుకోవడం దీని ప్రత్యేకత.

ఉదాహరణకు..: కుమార్‌కు రూ.5లక్షల ఆరోగ్య బీమా ఉందనుకుందాం. పాలసీ తీసుకున్న మూడు నెలల తరువాత ఒక వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాలసీ మొత్తం రూ.5లక్షలూ ఖర్చయ్యింది. మరో 9 నెలల తరువాత పాలసీ పునరుద్ధరణ చేసుకుంటే తప్ప బీమా పాలసీతో ఉపయోగం ఉండదు. మరో వ్యాధితో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.2లక్షలు ఖర్చయ్యాయనుకుందాం. అది సొంతంగా భరించాల్సిందే. కుమార్‌ ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు రీస్టోరేషన్‌ (రీస్టోర్‌, రీఫిల్‌) ఎంచుకుంటే.. మొదటిసారి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖర్చయిన రూ.5లక్షలు, ఇంటికి రాగానే పాలసీలో జమ అయ్యేవి. మరో వ్యాధి చికిత్సకు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇలా ఎన్నిసార్లు పాలసీకి రీస్టోరేషన్‌ అనుమతించాలన్నది బీమా సంస్థ, ఎంపిక చేసుకున్న పాలసీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.

మొత్తం పూర్తయితేనే: పాలసీ విలువ మొత్తం పూర్తయినప్పుడే మళ్లీ రీస్టోరేషన్‌ జరుగుతుంది. ఉదాహరణకు పాలసీదారుడు రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే.. ఆ మొత్తం పూర్తయ్యాకే.. మరోసారి పాలసీ విలువ రూ.5లక్షలకు చేరుతుంది. కొన్నిసార్లు రూ.4లక్షలు ఖర్చయి, మిగతా రూ.లక్ష మిగిలినప్పుడూ రీస్టోరేషన్‌ వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఈ విషయంలో బీమా సంస్థలను బట్టి, నిబంధనలు మారుతుంటాయి. రీస్టోరేషన్‌ ప్రయోజనం ఆ పాలసీ ఏడాదికే పరిమితం అవుతుంది. మరుసటి ఏడాదికి బదిలీ కాదు.

ఒకే వ్యాధికి..: విలువ తిరిగి భర్తీ అయ్యే రీస్టోరేషన్‌ పాలసీల్లో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. పాలసీదారుడు గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరాడనుకుందాం. పాలసీ విలువ మొత్తం రూ.5లక్షల బిల్లు అయ్యింది. తరువాత ఆ పాలసీ అదే విలువకు రీస్టోర్‌ అయ్యింది. ఇప్పుడు పాలసీదారుడు మరోసారి గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరితే... పాలసీ చికిత్స ఖర్చును ఇవ్వకపోవచ్చు. అదే ఇతర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే పరిహారం లభిస్తుంది. ఇప్పుడు కొన్ని పాలసీలు ఒకే వ్యాధికీ రీస్టోరేషన్‌ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పాలసీలను చూసి ఎంచుకోవడం మేలు. పాలసీ నియమ నిబంధనల్లోనే ఇది స్పష్టంగా ఉంటుంది.

  • మరో ముఖ్యమైన నిబంధననూ గమనించాలి.. ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.6లక్షల బిల్లు అయ్యిందనుకుందాం. కానీ, పాలసీ విలువ రూ.5లక్షలు మాత్రమే. రీస్టోరేషన్‌ ఉన్నా.. ఈ బిల్లులో పాలసీ మొత్తం రూ.5లక్షలు పోను రూ.లక్ష పాలసీదారుడు చెల్లించాల్సిందే. ఆ తరువాతే ఆ మొత్తం రీస్టోర్‌ అవుతుంది.
  • వ్యక్తిగత పాలసీదారులతో పాటు, కుటుంబం అంతటికీ వర్తించే ఫ్యామిలో ఫ్లోటర్‌ పాలసీ తీసుకున్నవారూ.. ఈ రీస్టోరేషన్‌ ప్రయోజనాన్ని పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకున్నప్పుడు.. దీని ప్రాధాన్యం అధికమనే చెప్పాలి. కుటుంబంలోని ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరి, మొత్తం పాలసీ విలువ పూర్తయితే, మిగతా సభ్యులకు బీమా రక్షణ ఉండదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా.. రీస్టోరేషన్‌ బెనిఫిట్‌ తోడ్పడుతుంది. కుటుంబానికి అదనపు భరోసాని కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు బీమా పాలసీని సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.

ఇదీ చదవండి: Insurance Policies: ఆ సందేశాలతో జర భద్రం.. లేకుంటే మీ జేబుకు చిల్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.