ETV Bharat / business

తెగ కొనేస్తున్నారు.. పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ చెల్లింపులు - యూపీఐ పేమెంట్స్

క్రెడిట్‌ కార్డ్‌లు పెరుగుతున్న కొద్దీ వినియోగదార్ల వ్యయాలు కూడా అధికమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు రూ.లక్ష కోట్లను అధిగమిస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, వినియోగం తిరిగి గాడిన పడుతోందనడానికి ఇదొక నిదర్శనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

credit-card-upi-payments
credit-card-upi-payments
author img

By

Published : Sep 12, 2022, 6:47 AM IST

క్రెడిట్‌ కార్డ్, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, వినియోగం తిరిగి గాడిన పడుతోందనడానికి ఇదొక నిదర్శనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నెలవారీ గణాంకాల ప్రకారం, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు ఏప్రిల్‌లో రూ.9.83 లక్షల కోట్లు కాగా, ఆగస్టు నాటికి రూ.10.73 లక్షల కోట్లకు చేరాయి.

అలాగే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా పీఓఎస్‌(పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) టెర్మినళ్ల వద్ద చెల్లింపులు రూ.29,988 కోట్ల నుంచి రూ.32,383 కోట్లకు చేరాయి. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద చెల్లింపులు రూ.51,375 కోట్ల నుంచి రూ.55,264 కోట్లకు పెరిగాయి. 2016-17 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరానికి క్రెడిట్‌ కార్డ్‌ బకాయిల విలువలో ఏటా 16 శాతం చొప్పున వార్షిక సంచిత వృద్ధి(సీఏజీఆర్‌) నమోదైందని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈఓ రామమోహన్‌ రావు అమర వెల్లడించారు. క్రెడిట్‌ కార్డ్‌లు పెరుగుతున్న కొద్దీ వినియోగదార్ల వ్యయాలు కూడా అధికమవుతున్నాయన్నారు. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు రూ.లక్ష కోట్లను అధిగమిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది వినియోగం పెరగడాన్ని సూచిస్తోందని, రాబోయే పండుగ సీజన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

డిజిటల్‌ లావాదేవీలు సంఖ్య, విలువ పరంగా క్రమంగా పెరుగుతున్నాయని ఇది ఆర్థిక వ్యవస్థకు శుభ పరిణామమని నిపుణులు, పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ రకాల డిజిటల్‌ చెల్లింపులపై వినియోగదార్లకు క్రమంగా అవగాహన పెరగడాన్ని కూడా ఇది సూచిస్తోందని విశ్లేషించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.