ETV Bharat / business

Cheapest Airtel Prepaid Plan : ఎయిర్​టెల్ బంపర్​ ఆఫర్​.. రూ.99 ప్లాన్​తో అన్​లిమిటెడ్​ డేటా! - చౌకైన ఎయిర్​టెల్​ ప్రీపెయిడ్​ ప్లాన్​ 2023

Cheapest Airtel Prepaid Plan : భారతీ ఎయిర్​టెల్​ తన యూజర్ల కోసం బంపర్​ ఆఫర్ ప్రకటించింది. రూ.99 డేటా ప్యాక్​ తీసుకున్న వారికి అపరిమితమైన డేటాను అందిస్తోంది. మరి దీని పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Airtel Rs 99 data pack
Cheapest Airtel Prepaid Plan 2023
author img

By

Published : Aug 15, 2023, 12:11 PM IST

Cheapest Airtel Prepaid Plan : ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్​టెల్​ తన యూజర్ల కోసం బెస్ట్​​ డేటా ప్లాన్​ను తీసుకొచ్చింది. బడ్జెట్​లో రూ.99 డేటా ప్యాక్​ తీసుకున్నవారికి.. అపరిమిత డేటాను అందిస్తోంది.

భారీ వ్యూహం!
Airtel ARPU 2023 : వాస్తవానికి భారతీ ఎయిర్​టెల్​.. యూజర్​ ఫ్రెండ్లీ టారిఫ్​లు అందించి తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) కూడా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్​లోని టెలికాం కంపెనీల్లో రూ.200 ఏఆర్​పీయూతో భారతీ ఎయిర్​టెల్​ అగ్రస్థానంలో ఉంది. దీనిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ.. తాజాగా రూ.99 డేటా ప్లాన్​ను తన ప్రీపెయిడ్​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

వినియోగదారుల విభిన్న అభిరుచులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఎయిర్​టెల్ అనేక​ అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్​లను తీసుకొచ్చింది. కానీ హై-స్పీడ్ డేటా అయిపోయిన తరువాత.. ఇంటర్నెట్​ స్పీడ్ ఆటోమేటిక్​గా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలోనే అన్​లిమిటెడ్​ హై-స్పీడ్ డేటా ప్యాక్​లు అక్కరకు వస్తాయి. యూజర్లు కూడా సరిగ్గా ఇలాంటి డేటా ప్లాన్​ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే భారతీ ఎయిర్​టెల్​ ఒక వ్యూహం ప్రకారం రూ.99 డేటా ప్లాన్​ను తీసుకొచ్చింది.

అన్​లిమిటెడ్​ డేటా.. కానీ
Airtel 99 Prepaid Plan : ఎయిర్​టెల్​ రూ.99 డేటా ప్యాక్​తో అపరిమిత డేటా వాడుకోవచ్చు. కానీ దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫెయిర్​ యుసేజ్ పాలసీ (ఎఫ్​యూపీ) నిబంధనల ప్రకారం, ఈ అన్​లిమిటెడ్ ప్రీపెయిడ్​​ ప్యాక్​ గరిష్ఠ డేటా పరిమితి 30జీబీ. ఒక వేళ యూజర్​ 30 జీబీ మొత్తాన్ని వినియోగించుకుంటే.. తరువాత 64Kbps వేగంతో ఇంటర్నెట్​ను వినియోగించుకోవచ్చు.

నోట్​ : ఈ రూ.99 డేటా ప్యాక్ వాడుకోవాలంటే.. యూజర్లు కచ్చితంగా ఎయిర్​టెల్​ యాక్టివ్​ బేసిక్​ ప్లాన్​ను కలిగి ఉండాలి.

అన్​లిమిటెడ్ 5జీ డేటా
Airtel Recharge Plans Unlimited : ఎయిర్​టెల్​ 5జీ ప్లస్​ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యూజర్లు.. 5జీ ఇంటర్నెట్​ను అపరిమితంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా రోజువారీ పరిమితులు లేకుండా 5జీ డేటాను వినియోగించుకోవచ్చు. కానీ ఈ 5జీ సదుపాయం లేని ప్రాంతాల్లోని ఎయిర్​టెల్​ వినియోగదారులకు తాజా రూ.99 డేటా ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. హై-స్పీడ్ ఇంటర్నెట్​ కావాలని ఆశించేవారికి, ఎక్కువగా డేటాను వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపకరిస్తుంది.

వొడాఫోన్​ ఐడియా - ఆఫర్స్
VI Independence Day Offer : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వొడాఫోన్​ ఐడియా (Vi) ఇండిపెండెన్స్ డే ఆఫర్​ ప్రకటించింది. తమ ప్రీపెయిడ్ యూజర్లు రూ.199 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్స్ తీసుకుంటే.. 50జీబీ వరకు డేటాను అందిస్తోంది. రూ.1,499 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.50​; అలాగే రూ.3,099 ప్లాన్​లను రీఛార్జ్ చేసుకుంటే రూ.75 వరకు డిస్కౌంట్​ అందిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.