ETV Bharat / business

బ్యాంకు రుణాలపై ఎన్నో ఛార్జీలు- ఏ లోన్​పై ఎంత వేస్తారో తెలుసా?

Charges On Various Bank Loans : బ్యాంకుల కార్యకలాపాల్లో లోన్​లు ముఖ్యమైనవి. మనం తీసుకునే వివిధ రుణాలపై వడ్డీతో పాటు ప్రాసెసింగ్​ ఫీజులు, పెనాల్టీలు అని రకరకాల ఛార్జీలు వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. అయితే ఎలాంటి లోన్​లపై ఏ రకమైన ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం.

Charges On Various Bank Loans Charges collected by the Banks on different types of Loans

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 2:43 PM IST

Charges On Various Bank Loans : బ్యాంకులు మనుగడ సాగించాలంటే రుణాలు చాలా కీలకమైనవి. అందుకే బ్యాంకులు గృహ, వాహన, వ్యక్తిగత, ఎడ్యుకేషన్ వంటి అనేక రకాల లోన్​లు అందించి, ఆ రుణాలపై వడ్డీతో పాటు అనేక రకాల ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే ఈ ఛార్జీలు మనం తీసుకునే లోన్​ను బట్టి ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి రుణం అధిక మొత్తంతో కూడుకున్నది కాబట్టి, దీనికి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు వంటి అనేక ఇతర రుసుములు కూడా తీసుకుంటారు. హోమ్​ లోన్​కు దరఖాస్తు చేసే ముందు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హోమ్​ లోన్​పై ఛార్జీలు
హోమ్​ లోన్​పై బ్యాంకులు సగటున 7-9 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి వడ్డీ తక్కువ పడుతుంది. చాలా మంది బ్యాంకు రుణంపై తక్కువ వడ్డీని చూసి దరఖాస్తు చేస్తుంటారు. బ్యాంకులు లోన్​ ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తర్వాత కూడా చాలా ఛార్జీలు వసూలు చేస్తాయి. హోమ్​ లోన్​ మంజూరు చేయడానికి బ్యాంకులు, దరఖాస్తుదారుడు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. దానికి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఈ ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.

సాధారణంగా బ్యాంకులు లోన్​ మొత్తం అమౌంట్​పై 0.5-1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. అయితే మన వద్ద ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేశారు గనుక, మన రుణ దరఖాస్తు కచ్చితంగా ఆమోదిస్తారని భావించకూడదు. ఒకవేళ బ్యాంకు హోమ్​ లోన్ దరఖాస్తును తిరస్కరిస్తే, రుణగ్రహీతకు ఈ రుసుంలో ఎలాంటి మొత్తం వాపసు రాదు. ఇంటి రుణాన్ని ఆమోదించిన తర్వాత బ్యాంకులు నిర్వహణ ఫీజును వసూలు చేస్తాయి. లోన్​ తీరే వరకు ఆస్తి (ఇంటి) దస్తావేజులను బ్యాంకు భద్రపరుస్తుంది. దీనికి కూడా రుసుం వసూలు చేస్తుంది. ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐ కాలవ్యవధిని మార్చాలనుకుంటే, దానిపై బ్యాంకుకు అదనపు ఛార్జీని వడ్డిస్తుంది.

హోమ్​ లోన్​ను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఫిక్స్‌డ్‌ రేటుపై ఇంటి రుణాన్ని తీసుకున్నవారు లోన్​ను ముందస్తుగా చెల్లించడాని(ప్రీ-క్లోజర్‌)కి సిద్ధపడితే బ్యాంకు పెనాల్టీని వసూలు చేస్తుంది. ఇది మిగిలిన మొత్తంలో 2 నుంచి 6 శాతం వరకు ఉండొచ్చు. ఒకవేళ మీరు రూ.6 లక్షల బ్యాలెన్స్‌ చెల్లించి లోన్‌ ఖాతాను క్లోజ్‌ చేస్తే రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు బ్యాంకుకు చెల్లించాల్సి రావచ్చు.

ఆస్తికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌లు/ ఓనర్‌షిప్‌ పత్రాలను లోన్​ కోసం తాకట్టుగా బ్యాంకుకు అందిస్తారు. మీ ఆస్తి చట్టపరమైన సమస్యలో చిక్కుకున్నట్లయితే ఈ పత్రం ఉపయోగపడుతుంది. దీనిపైనా రుసుం ఉంటుంది. ఇలాంటి ఛార్జీలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలు ఆస్తి ధరలో 0.1 శాతం నుంచి 0.2 శాతం వరకు ఉంటాయి. హోమ్​ లోన్‌తో పాటు ఇంటి/ లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేయాలని కొన్ని బ్యాంకులు పట్టుబడుతుంటాయి. ఇలా చేయడం తప్పనిసరి కాదని గుర్తు పెట్టుకోండి. హోమ్​ లోన్​ను ఆఫర్‌ చేస్తున్నప్పుడు బ్యాంకులు రుణగ్రహీతకు అనేక సేవలను అందిస్తాయి. ఇవి జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. ప్రాసెసింగ్‌ ఫీజు, అడ్మినిస్ట్రేషన్‌ ఫీజు, టెక్నికల్‌, లీగల్‌ అసెస్‌మెంట్‌ ఫీజు మొదలైన వాటన్నింటిపై జీఎస్‌టీని వసూలు చేస్తాయి.

ఎడ్యుకేషన్ లోన్​పై ఛార్జీలు
ప్రస్తుతం భారతదేశంలో విద్య కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగానే మంజూరు చేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ లోన్​ ప్రాసెస్​ చేయడానికి బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ ఫీజు మనం తీసుకునే రుణం మొత్తంలో ఒక శాతం మేర ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు మనం చెల్లించే ప్రాసెసింగ్‌ ఫీజుపై సర్వీస్ ఛార్జీని కూడా విధిస్తాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైనప్పుడు, ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తాయి. ఇది ఈఎంఐ మొత్తంలో 2-3 శాతం ఉండొచ్చు. దీనికి అదనంగా జీఎస్‌టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్​ను తీసుకున్నప్పుడు బీమా కూడా ప్రధానమైనది. రుణ చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు, లోన్​ తీసున్నవారు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ బీమా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇలా తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్​ తీసుకొకపోతే, కొన్ని బ్యాంకులు అదనపు వడ్డీని విధిస్తాయి. ఇది ప్రభుత్వ బ్యాంకుల్లో 0.05 శాతం నుంచి 0.25 శాతం వరకు ఉంటుంది. ఇక ప్రైవేట్‌ బ్యాంకుల్లో 2 శాతం వరకు ఉంటుంది.

ఆస్తిని తాకట్టు పెట్టి లోన్​ తీసుకుంటే
ఆస్తిని తాకట్టు పెట్టి విద్యా రుణం లోన్​ తీసుకోవాలనుకునే వారు రుణ మొత్తంలో 0.25 శాతం నుంచి 0.5 శాతం వరకు మార్ట్‌గేజ్‌ క్రియేషన్‌ ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ తాకట్టు ఛార్జీలను మాఫీ చేస్తాయి. ఒకవేళ రుణగ్రహీత తాకట్టు పెట్టిన ఆస్తి (ఇల్లు) పాతదైతే, అది కూలిపోయినా, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఆస్తిపై బీమా చేయాలని బ్యాంకులు అడుగుతాయి. ఇక విద్యా రుణం తీసుకునేవారు ప్రయాణ బీమా, ఆరోగ్య బీమా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి అన్ని ఛార్జీలు విద్యా రుణానికి చాలా వరకు తప్పవు.

పర్సనల్ లోన్​పై ఛార్జీలు
అత్యవసర ఖర్చులకు లేదా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. అయితే ఈ లోన్​పై వడ్డీ మాత్రమే కాకుండా ఇతర ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. పర్సనల్ లోన్​ తీసుకునే వారు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లోన్​ను ప్రాసెస్‌ చేసే సమయంలో అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన కొంత ఖర్చు ఉంటుంది. దీన్ని రుణ గ్రహీత భరించాల్సి ఉంటుంది. ఇది లోన్‌ మొత్తంపై 0.5 శాతం నుంచి 2.50శాతం వరకు ఉండొచ్చు. అయితే వ్యక్తిగత రుణం ప్రాసెసింగ్‌ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. పర్సనల్​ లోన్​పై వెరిఫికేషన్‌ ఛార్జీలు కూడా కూడా ఉంటాయి. రుణ బకాయిలను కాలవ్యవధికి ముందే చెల్లించాలని భావిస్తే బ్యాంకు ముందస్తు చెల్లింపునకు ఫైన్​ వేసే అవకాశం ఉంది. ఇక ఈ పెనాల్టీ సాధారణంగా 2 నుంచి 4శాతం వరకు ఉంటుంది.

చెల్లింపులు, రుణం బాకీ ఉన్న డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌లను బ్యాంకులు అడిగితే దీనికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇది రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈఎంఐ ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుకు ఫైన్​ కట్టాల్సి వస్తుంది. దీనికి తోడు మనం కట్టిన జరిమానా మొత్తానికి అదనంగా జీఎస్‌టీ చెల్లించాలి.

కార్ ​లోన్​పై ఛార్జీలు
మనం తీసుసుకే ప్రతి లోన్​కు వసూలు చేసే ప్రాసెస్‌ ఛార్జీలు, మంజూరు చేయడం కోసం అడ్మినిస్ట్రేషన్​ ఖర్చులు బ్యాంకులు ఈ కార్​లోన్​పై కూడా వసూలు చేస్తాయి. ఇది లోన్‌ మొత్తంపై 0.50శాతం నుంచి ఒక శాతం మధ్య ఉంటుంది. ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.1,000 నుంచి రూ.9,000 మధ్య ఉండొచ్చు. కారు లోన్​ ఆమోదం పొందిన తర్వాత రుణగ్రహీతలు ఈ ఛార్జీని భరించవలసి ఉంటుంది. కొన్ని పండగ ఆఫర్లలో బ్యాంకులు ఈ ఛార్జీలను మాఫీ చేసే అవకాశం ఉంది. కారు రుణాలపై ప్రీ-క్లోజర్‌ (ముందస్తు చెల్లింపులకు) అనుమతి ఉంటుంది. కానీ వాటిపై కూడా బ్యాంకులు పెనాల్టీని వసూలు చేస్తాయి. పెనాల్టీలు, బకాయి ఉన్న లోన్‌ మొత్తం ఆధారంగా వసూలు చేస్తారు. లోన్​ తీసుకున్న మొదటి ఏడాది తర్వాత ప్రీ-క్లోజ్‌ చేస్తే, కొన్ని బ్యాంకుల్లో రుణ మొత్తంలో 5శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Personal Loan Requirements : పర్సనల్​ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

బ్యాంకు లోన్​ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.