Car Buying Tips : కారు కొనుక్కోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ కారు కొనడం అనేది ఒక పెద్ద నిర్ణయం అవుతుంది. అందుకే మీ వ్యక్తిగత అవసరాలు, జీవన విధానం, బడ్జెట్‌కు అనుగుణంగా కారును ఎంచుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొత్త కారు కొనాలా? లేదా పాత కారు కొనాలా? అనే విషయంలో ముందే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
New car vs used car : కొత్త కారు కొన్నా, పాత కారు కొన్నా కూడా.. రెండింటి వల్ల కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయి. కొత్త కార్లు లేటెస్ట్ టెక్నాలజీతో, సరికొత్త ఫీచర్లతో వస్తాయి. వీటికి వారంటీ కూడా ఉంటుంది. కానీ వీటి ధర ఎక్కువ. పాత కార్ల విషయానికి వస్తే, వాటి ఖరీదు కాస్త తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్ ఉండకపోవచ్చు. దానికి తోడు తరచూ రిపేర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కారు కొనేముందు ఏఏ అంశాలు పరిశీలించాలో చూద్దాం.
1. బడ్జెట్
ముందుగా మీరు ఎంత మేరకు బడ్జెట్ పెట్టగలరో ఒక నిర్ణయానికి రావాలి. ఒక వేళ మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే, కచ్చితంగా కొత్త కారు కొనడమే మంచిది. ఒక వేళ మీ దగ్గర లిమిటెడ్ క్యాష్ మాత్రమే ఉంటే పాత కారు కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే సమాజంలో ప్రెస్టీజ్ కోసం శక్తికి మించి ఖర్చు చేసి కొత్త కారు కొంటే మాత్రం, ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే పాత కారు అయితే తక్కువ ఖర్చుతోనే మేనేజ్ చేయవచ్చు. డిప్రిసియేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
2. అవసరాలకు అనుగుణంగా!
వాస్తవానికి మీకు కారు కొనాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది చాలా కచ్చితంగా నిర్ణయించుకోవాలి. రోజూ మీకు పని ఉంటే.. పాత కారు కొనుగోలు చేయడం మంచిది. అలాకాకుండా లాంగ్ రోడ్ ట్రిప్స్ కోసం, దర్జా కోసం కొత్త కారు కొనుక్కోవడం ఉత్తమం.
3. జీవన శైలికి అనుగుణంగా!
మీరు మీ జీవనశైలికి అనుగుణంగా కారును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరదా కోసం, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం అయితే కొత్త కారు కొనుక్కోవాల్సిందే. అలా కాకుండా సాధారణ ప్రయాణాల కోసం, అవసరాల కోసం అయితే పాత కారు కొనుక్కోవడం మంచి ఆప్షన్ అవుతుంది.
4. రీసేల్ వాల్యూ
Car resale value estimate : మీరు చాలా కాలంపాటు కారు ఉపయోగించాలి అనుకుంటే కొత్త కారు కొనుక్కోవడం మేలు. అలా కాకుండా కొన్నాళ్లు వాడి, అమ్మేయాలని భావిస్తే పాత కారు కొనుగోలు చేయడం మంచిది.
5. నిపుణులను సంప్రదించండి
పై నాలుగు అంశాలు పరిశీలించిన తరువాత మీరు ఎలాంటి కారు కొనుక్కోవాలో ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. అయినా ఇంకా మీకు సందేహాలు ఉంటే.. మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను గానీ, కారు డీలర్‌ను గానీ సంప్రదించడం మంచిది. వారు మీ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి కారు కొనుగోలు చేయాలన్న విషయంపై ఒక మంచి సలహా ఇచ్చే అవకాశం ఉంది.
6. రీసెర్చ్ చేయండి
కారు కొనేముందు కచ్చితంగా రీసెర్చ్ చేయాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లు, వాటి బ్రాండ్స్, మోడల్స్, ప్రైస్ కంపేర్ చేయాలి. అలాగే కార్ల రివ్యూలు చదవడం సహా, రీసేల్ వాల్యూ గురించి తెలుసుకోవాలి.
7. లోన్ వస్తుందో? లేదో? చూడండి
Car loan estimate : వాహనం కొనుగోలు చేసే ముందు, దానికి ప్రీ-అప్రూవ్డ్ లోన్ వస్తుందో? లేదో? తెలుసుకోండి. దీని వల్ల ఆ కారు ధరను కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
8. బేరం అడండి
Car buying rule : కారు కొనుగోలు చేసేటప్పుడు బేరం అడడంలో ఎలాంటి మొహమాటాలు పడకండి. ఒక వేళ డీలర్ కాదంటే, బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేయండి. కచ్చితంగా కారు డీలరే మిమ్మల్ని మళ్లీ పిలిచి, మంచి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
కారు కొనేముందు కచ్చితంగా మీ బడ్జెట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఇన్సూరెన్స్, లోన్ అప్షన్స్ అన్నీ చూసుకోవాలి. పాత కారు కొంటున్నట్లు అయితే మంచి రెప్యూటెడ్ డీలర్ల వద్ద మాత్రమే తీసుకోవాలి. అలాగే కొనే ముందే ఆ పాత కారు కండీషన్ ఎలా ఉందో నిపుణుల చేత చెక్ చేయించాలి. దీని వల్ల మనకు కనిపించని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కనుగొనడానికి వీలు అవుతుంది. ఈ విధంగా కారు కొనేముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.