ETV Bharat / business

తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బైజూస్‌ సీఈఓ.. వారికే ప్రాధాన్యం అని హామీ - ఉద్యోగులను తొలగించిన బైజూస్​

ఉద్యోగుల తొలగింపుపై బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రవీంద్రన్‌ స్పందించారు. తొలగించిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు.

byjus-ceo-says-job-cuts-necessitated-due-to-macroeconomic-developments
ఉద్యోగుల తొలగింపుపై స్బందించిన బైజూస్‌ సీఈఓ
author img

By

Published : Oct 31, 2022, 10:42 PM IST

ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజుస్‌.. ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 2,500 మందికి ఆ కంపెనీ ఉద్వాసన పలికింది. దీంతో ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిందంటూ ఆ కంపెనీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రవీంద్రన్‌ తాజాగా స్పందించారు. తొలగించిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. పరిస్థితుల ప్రభావం వల్ల తొలగింపు తప్పలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులకు సందేశం పంపించారు. బైజూస్‌ స్థిరత్వం, లాభదాయకతపై దృష్టి సారించినట్లు చెప్పారు.

వేగంగా వృద్ధి చెందే క్రమంలో సంస్థలో అవసరానికి మించిన మానవ వనరులు గతంలో తీసుకోవాల్సి వచ్చిందని రవీంద్రన్‌ పేర్కొన్నారు. అలాంటి సంస్థను హేతుబద్ధీకరించడంలో భాగంగా 5 శాతం (2,500) మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. బైజూస్‌ను విడిచి వెళ్లిన వారికి క్షమాపణ చెబుతున్నానని చెప్పారు. 2022లో ఎదురైన అనేక పరిస్థితులు వ్యాపార స్వరూప స్వభావాన్నే మార్చివేశాయని, ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్‌ కంపెనీలూ స్థిరత్వం, లాభదాయకతపై దృష్టి సారించాయని రవీంద్రన్‌ అన్నారు. ఇందుకు బైజూస్‌ సైతం ఏమీ మినహాయింపు కాదన్నారు.

రోల్‌ డూప్లికేషన్లను నివారించడంలో భాగంగా ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రవీంద్రన్‌ తెలిపారు. ఉద్యోగాలను కాపాడేందుకు తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. కంపెనీ లాభాల్లోకి వచ్చి స్థిరత్వం సాధించాక.. తొలగించిన ఉద్యోగులను కంపెనీలో భాగస్వామ్యం చేసుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తమ మానవ వనరుల విభాగానికి సైతం తెలియజేసినట్లు చెప్పారు. కొత్తగా సృష్టించే ఏ పోస్ట్‌కైనా తొలగించిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.