ETV Bharat / business

Big Bull Rakesh Jhunjhunwala : రూ.5 వేల నుంచి రూ.44 వేల కోట్ల సంపద సృష్టి.. ఇలా చేస్తే సాధ్యం! - ఈక్విటీ​ మార్కెట్ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్

Big Bull Rakesh Jhunjhunwala success Story In Telugu : భారత స్టాక్​ మార్కెట్​లో రాకేశ్​ ఝున్​ఝున్​వాలాది ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ప్రారంభమైన ఆయన ప్రస్థానం రూ.44,000 కోట్ల సంపద సృష్టించడం వరకు కొనసాగింది. ఆయన బతికి ఉన్నంత కాలం ఆయనే బుగ్​ బుల్​. మరి ఆయన సక్సెస్ మంత్రం ఏమిటో మీకు తెలుసా?

Rakesh Jhunjhunwala 10 investment principles
Big Bull Rakesh Jhunjhunwala
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 3:17 PM IST

Big Bull Rakesh Jhunjhunwala success Story In Telugu : స్టాక్​ మార్కెట్ అనేది​ ఒక పరమపద సోపానం లాంటిది. ఇక్కడ ఎన్నో నిచ్చెనలు ఉంటాయి. మరెన్నో భయంకరమైన పాములూ ఉంటాయి. పైకి వెళ్లినవాడు కింద పడవచ్చు. కింద ఉన్నవాడు అమాంతం శిఖరం చేరుకోవచ్చు. కానీ ఇలాంటి సంక్లిష్టమైన, ఊహలకందని మార్కెట్​లో జయకేతనం ఎగరేశారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా. అందుకే ఆయనను భారత స్టాక్​ మార్కెట్​ బిగ్ బుల్​ అని, ఇండియన్​ వారెన్​ బఫెట్, దలాల్ స్ట్రీట్ మొగల్​​ అని పిలుస్తూ ఉంటారు.

విజయ ప్రస్థానం
Rakesh Jhunjhunwala Life Story : రాకేశ్ ఝున్​ఝున్​వాలా కేవలం రూ.5,000 పెట్టుబడితో స్టాక్​ మార్కెట్​లో అడుగుపెట్టారు. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ రూ.44,000 కోట్ల రూపాయల సంపదను సంపాదించారు. మరణించేంత వరకు ముంబయిలోని దలాల్​ స్ట్రీట్​ బిగ్​ బుల్​గానే కొనసాగారు.

బాల్యం
Rakesh Jhunjhunwala Childhood : రాకేశ్ ఝున్​ఝున్​వాలా 1960 జులై 5న ముంబయిలో జన్మించారు. ఆయన తండ్రి రాధేశ్యామ్​ ఒక ఇన్​కం టాక్స్ అధికారి. ఆయన తన స్నేహితులతో కలిసి స్టాక్ మార్కెట్ గురించి తరచూ చర్చించేవారు. దీని గురించి రోజూ వింటూ.. రాకేశ్ ఝున్​ఝున్​వాలా కూడా స్టాక్​ మార్కెట్​పై అభిరుచి పెంచుకున్నారు. స్టాక్​ మార్కెట్​లో ప్రవేశించాలని ఓ గట్టి నిర్ణయానికి వచ్చారు. కానీ ఆయన తండ్రి రాధేశ్యామ్​ మొదట్లో ఇందుకు ససేమిరా ఒప్పుకోలేదు. కానీ..

ఓనమాలు నేర్చుకో!
Rakesh Jhunjhunwala Stock Market Lessons : రాధేశ్యామ్ తన కుమారుడు రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు స్టాక్​ మార్కెట్​ మీద ఉన్న అమితాసక్తిని గమనించి.. ఓ విలువైన సలహా ఇచ్చారు. స్టాక్​ మార్కెట్​లో ప్రవేశించే ముందు కచ్చితంగా దాని గురించి లోతుగా తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రతిరోజూ న్యూస్​ పేపర్ చదవాలని, స్టాక్​ మార్కెట్​లో వచ్చే ప్రతి మార్పును గమనించాలని సూచించారు. రాకేశ్ ఝున్​ఝున్​వాలా తన తండ్రి మాటను ఒక మంత్రంలా తీసుకున్నారు. స్టాక్ మార్కెట్​ను నిశితంగా పరిశీలించి, అందులోని మర్మాలన్నీ తెలుసుకోగలిగారు.

రూ.5,000తో ప్రారంభం
Rakesh Jhunjhunwala Net Worth : రాకేశ్ ఝున్​ఝున్​వాలా తన తండ్రి వద్ద రూ.5,000 తీసుకొని స్టాక్​ మార్కెట్​లో అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంలో ఆయన తండ్రి రాధేశ్యామ్ ఓ షరతు పెట్టారు. ఇకపై తన (రాధేశ్యామ్​) వద్ద గానీ, తన స్నేహితుల వద్ద గానీ డబ్బులు అడగకూడదని షరతు విధించారు. రాకేశ్ అందుకు ఒప్పుకుని స్టాక్​ మార్కెట్​లో అడుగుపెట్టారు. కేవలం రూ.5 వేల రూపాయలతో ప్రారంభమైన ఆయన స్టాక్ మార్కెట్ ప్రస్థానం.. రూ.44,000 కోట్ల సంపదను సొంతం చేసుకునే వరకు కొనసాగింది.

అమ్మాయి దగ్గర అప్పు చేసి..
Rakesh Jhunjhunwala Business Success Story : రాకేశ్ ఝున్​ఝున్​వాలా మొదట్లో చిన్న మొత్తాలతో స్టాక్ మార్కెట్​ ట్రేడింగ్ చేశారు. తరువాత ఆయన పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం, ఆయనను మరలా డబ్బులు అడగలేదు. తన తమ్ముడి స్నేహితురాలి వద్ద 18 శాతం వడ్డీ చెల్లించే షరతుతో రూ.5 లక్షలు అప్పులు తీసుకున్నారు. ఆ మొత్తం సొమ్మును స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేశారు.

ఫస్ట్​ ప్రాఫిట్​
Big Bull Of Dalal Street : రాకేశ్​ ఝున్​ఝున్​వాలా 1986లో రూ.5,000 పెట్టి టాటా టీ షేర్లు కొనుగోలు చేశారు. కేవలం 3 నెలల్లో ఆ స్టాక్ ధర రూ.43 నుంచి రూ.143కి చేరింది. అంటే రాకేశ్​కు 3 రెట్లు లాభం వచ్చింది. ఇలా ఆయన విజయపరంపర మొదలైంది. కేవలం మూడేళ్ల ఆయన రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సంపాదించారు. ఇలా అప్రతిహతంగా ఆయన దూసుకుపోయారు. స్టాక్​ మార్కెట్ బిగ్ బుల్​గా ఎదిగారు.

సేవా పథంలో
Rakesh Jhunjhunwala Charity :

  • 2008లో రాకేశ్ తండ్రి రాధేశ్యామ్ మరణించారు. అప్పటి నుంచి రాకేశ్​ ఝున్​ఝున్​వాలా.. తన తండ్రి ఆత్మశాంతి కోసం.. తన నికర ఆదాయంలో 25 శాతం వరకు దానధర్మాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నారు.
  • సైన్స్​ ప్రయోగాలను ప్రోత్సహించేందుకు అగస్త్య ఇండర్నేషనల్​ ఫౌండేషన్​కు ఆర్థికంగా సాయం చేస్తున్నారు.
  • ముంబయిలో ఆర్​.ఝున్​ఝున్​వాలా శంకర్ ఐ హాస్పిటల్​ ప్రారంభించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ.

రాకేశ్ ఝున్​ఝున్​వాలా ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్​
Rakesh Jhunjhunwala 10 Investment Principles : రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఆయన చెప్పిన పెట్టుబడి సూత్రాలు మాత్రం అందరికీ ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. ఫైటింగ్ స్పిరిట్ : స్టాక్​ మార్కెట్​లోకి వచ్చిన వారు లాభాలు వచ్చినప్పుడు సంబరపడడం మాత్రమే కాదు. నష్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా మార్కెట్​ నష్టాల్లో ఉన్నప్పుడు భయపడిపోయి, మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లను అమ్మకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో వెళ్లాలి. ఇందుకోసం స్వల్పకాలంలో వచ్చే ఒడుదొడుకులను తట్టుకోవాల్సి ఉంటుంది.
  2. రెస్పెక్ట్​ ది మార్కెట్ : స్టాక్ మార్కెట్ కొన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ రూల్స్​కు అనుగుణంగా ఇన్వెస్టర్లు నడుచుకోవాల్సి ఉంటుంది.
  3. నష్టాలకు సిద్ధంగా ఉండాలి : స్టాక్​ మార్కెట్​లో ఒడుదొడుకులు, లాభనష్టాలు చాలా సర్వసాధారణం. అందువల్ల ​మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లు ఒక వేళ భారీ నష్టాల దిశగా వెళ్తూ ఉంటే.. వెంటనే అప్రమత్తమై లాస్​ బుకింగ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
  4. దీర్ఘకాలిక పెట్టుబడులు : సాధారణంగా పెట్టుబడిదారులు తక్కువ సమయంలో భారీ లాభాలు రావాలని ఆశిస్తూ ఉంటారు. కానీ స్టాక్​ మార్కెట్​ విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. ఇందుకోసం Buy, Hold And Forget అనే సూత్రం పాటించాలి. అంటే మంచి స్టాక్స్ కొని, వాటిని పోర్టుఫోలియోలోనే ఉంచుకోవాలి. అవసరమైతే వాటి గురించి మరిచిపోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి.
  5. హోమ్​ వర్క్​ : స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేసే ముందు కచ్చితంగా సరైన హోమ్ వర్క్ చేయాలి. న్యూస్​లో ఉన్న కంపెనీలు గురించి కాకుండా, మంచి వ్యాపారం చేసే, భవిష్యత్​లో గొప్ప లాభాలు గడించే సామర్థ్యం ఉన్న కంపెనీలను ముందుగా గుర్తించాలి. తరువాత వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతేగానీ ప్రస్తుతం భూమ్​లో ఉన్న స్టాక్స్​ వెంటబడి డబ్బులు పోగొట్టుకోకూడదు.
  6. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు : పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. స్వల్పకాలిక మార్కెట్​ సెంటిమెంట్​లకు లోబడి ఇన్వెస్ట్​మెంట్స్ చేయకూడదు. చాలా నిదానంగా, బాగా పరిశోధన చేసిన తరువాత, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి.
  7. మీ కోసం మార్కెట్​ మారదు : స్టాక్​ మార్కెట్​ మీకు నచ్చినట్లుగా ఉండదు.. మారదు. అందువల్ల స్టాక్ మార్కెట్​కు అనుగుణంగా నడుచుకోవడం మీరు నేర్చుకోవాలి. ఏ ఒక్కరూ స్టాక్ మార్కెట్​ గమనాన్ని మార్చలేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.
  8. ధైర్యంగా ఉండాలి : ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉండాలి. తను కన్న కలలు కోసం పాటుపడాలి. ఈ విషయంలో ఎలాంటి భయాలకు తావులేదు. మనలోని ధైర్యమే.. మనల్ని మేధావులుగా, శక్తిమంతులుగా మారుస్తుంది. వాస్తవానికి ధైర్యంలో ఒక చెప్పలేని మ్యాజిక్ ఉంది. అది మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. స్టాక్ మార్కెట్ కరెక్షన్​కు గురైనప్పుడు మంచి రియల్ వాల్యూ ఉన్న స్టాక్స్​ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో చాలా ధైర్యంగా ముందుకు అడుగువేయాలి.
  9. చురుకుగా ఉండండి : స్టాక్ మార్కెట్​ ఇన్వెస్ట్​మెంట్​ చేసేవారు.. ఎప్పుడూ మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తూ ఉండాలి. మీరు ఎంచుకున్న స్టాక్స్ భారీ లాభాల్లోకి వెళితే.. కచ్చితంగా ప్రాఫిట్ బుక్​ చేయాలి. ఒక వేళ మీ స్టాక్స్ నష్టాల్లో ఉంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా లాస్​ బుక్ చేసి తీరాలి.
  10. మీ రూటే సపరేట్​గా ఉండాలి : మార్కెట్​లో అందరూ షేర్స్ అమ్మేస్తూ ఉంటే.. మీరు ఆ షేర్స్ కొనండి. మార్కెట్​లో అందరూ షేర్స్ కొనేస్తూ ఉంటే.. మీరు ఆ షేర్స్ అమ్మేయండి. అంటే షేర్స్ డిస్కౌంట్​లో వస్తున్నప్పుడు వాటిని కొనండి. అవి బాగా లాభాల్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి.

Rakesh Jhunjhunwala Success Mantra : ఈ విధంగా దలాల్​ స్ట్రీట్ బిగ్​ బుల్ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్లకు తన సక్సెస్​ మంత్రాన్ని తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.