Best phone under 25000 : కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకున్న సమయంలో ఏది తీసుకోవాలనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ఏ మొబైల్ తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. తక్కువ ధరలో మంచి ఫోన్ లభించాలని అనుకుంటారు. అలాంటివారి కోసం మార్కెట్‌లో రూ.25 వేలలోపు ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దామా.
మార్కెట్‌లో దొరికే వాటిల్లో బెస్ట్ ఫోన్ ఏంటంటే.. చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్‌లో అనేక రకాల బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి. కొత్త ఫీచర్లను జోడిస్తూ ఫోన్ల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లను విడుదల చేస్తూ ఉంటాయి. ఎవరైనా సరే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.25 వేలలోపు ధరలో అత్యాధునిక ఫీచర్లతో మంచి ఫోన్లు లభిస్తున్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ A23 5జీ
శామ్‌సంగ్ 'A' సిరీస్‌లో మంచి డిజైన్‌తో లభించే ఫోన్ ఇది. యాంబియంట్ ఎడ్జ్ డిజైన్‌లో లభించే ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 50ఎంపీ లెన్స్‌పై ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) కలిగి ఉండటం దీని స్పెషాలిటీ. ఈ ఫీచర్ కెమెరా మరింత మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వెనుక కెమెరాలో 5ఎంపీ అల్ట్రా వైడ్ లైన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉంటాయి. దీని ధర రూ.24,999గా ఉంది.
రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ
ఈ ఫోన్ జిప్పీ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫీచర్ వల్ల కాంతి తక్కువ ఉన్నప్పుడు కూడా చిత్రాలను అత్యుత్తమ నాణ్యాతతో తీసుకోవచ్చు. అలాగే సోని IMX 766 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఇన్ బాక్స్ ఛార్జర్ కలిగి ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది ఈ ఫోన్ ధరలు రూ.24,999 నుంచి ప్రారంభమవుతాయి.
వివో Y100
దీనిని రంగులు మార్చే ఫోన్‌గా చెప్పవచ్చు. ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ బ్యాక్‌తో ట్వైలైట్ గోల్డ్‌తో ఈ ఫోన్ ఉంటుంది. ఇది కాంతిని బట్టి నారింజ లేదా బంగారం రంగులోకి మారుతూ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఛార్జర్ కలిగి ఉంటుంది. 64 ఎంపీ ప్రైమరీ లెన్స్ OISతో కూడిన ప్రైమరీ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది రూ.24,999లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 30
ఇది చాలా తేలికపాటి ఫోన్. కేవలం 6.79 మిమీ సన్నగా ఉంటుంది. 155 గ్రాములతో చాలా తేలికగా ఉంటుంది. వెనుక కెమెరా 50ఎంపీ అల్ట్రా వైడ్+మాక్రో క్యామ్, OISతో 50ఎంపీ ప్రైమరీ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ కలిగి ఉంటుంది. దీని ధర కేవలం రూ.23,999.
ఒప్పో F21S ప్రో
డాన్‌లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. మీ ఫోన్ మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 2ఎంపీ హైక్రోస్కోపిక్ లెన్స్‌తో మాక్రో లెన్స్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ కేవలం రూ.21,999కే లభిస్తుంది.
పోకో ఎక్స్5 ప్రో
ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, క్లీన్ లైన్‌లతో ఉంటుందీ ఫోన్. లైనప్‌కు కొత్త ఫ్రాస్టెడ్ బ్లూ రంగుని చేర్చినప్పటికీ.. పసుపు రంగులో కొత్త డిజైన్ ఫొన్ చాలా బాగుంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్ కలిగి ఉంటుంది. 16జీబీ/128జీబీ లేదా 8జీబీ/256జీబీలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర రూ.22,999.